రైతులకు బాసటగా నిలుస్తాం

– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, ప్రకృతి వైపరీత్యాల బారినపడ్డ రైతాంగానికి బాసటగా ఉంటామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతాంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడుతుందని తెలిపారు. హుజుర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల నిమిత్తం నియోజకవర్గంలో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. చెరువులో చేప పిల్ల‌ల‌ను విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పన చేపడతామని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు నమోదు చేసిన 48 గంటల వ్యవధిలో చెల్లింపులు జరుపుతామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తెలంగాణలో పండిన పంట ఆల్‌ టైం రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. ఒకే ఒక్క కారులో ఇంతటి ఉత్పత్తి సాధించడం ముమ్మాటికీి ప్రభుత్వ ఘనతేనని, రైతాంగం పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానాలతోటే దిగుబడిలో రికార్డు సృష్టించగలిగామని మంత్రి ఉత్తవమ్‌ చెప్పారు. దిగుబడిలోనే కాదు కొనుగోలులోనూ తెలంగాణా రికార్డు సృష్టిస్తోందన్నారు. ముందెన్నడూ లేని రీతిలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఇదే ప్రప్రథమమన్నారు. యావత్‌ దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు ముందెన్నడూ లేవన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రజాప్రతినిధులు విధిగా బాగస్వామ్యం కావాలని మంత్రి ఉత్తవమ్‌ పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page