నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ మధ్య ఇఫ్తార్ కార్యక్రమంలో మాట్లాడుతూ ముస్లిములను ఎవరన్నా ఇబ్బంది పెడితే తాను సహించనని, అండగా ఉంటానని అన్నారు. ఆయన మాటలకు నేపథ్యం- ‘ఛావా’ సినిమా నేపథ్యంలో నాగపూర్ లో జరిగిన హింసాకాండ. మహారాష్ట్ర ప్రభుత్వంలోని మూడు భాగస్వామ్య పార్టీలలో ఆయనది ఒకటి. పవార్ ఆ వాగ్దానం చేసిన మర్నాడే అనేక బుల్డోజర్ కూల్చివేతలు జరిగాయి. అజిత్ మాటలకే కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలకు కూడా ఆ కూల్చివేతలు విరుద్ధం. అయినా పవార్ కిక్కురుమనలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆయన కుమా రుడు, మంత్రి నారా లోకేశ్ కూడాస్వయంగా ఒక ముస్లిం కుటుంబం ఇంటికి వెళ్లి పద్ధతి ప్రకారం ఉపవాసదీక్ష విరమణ చేయించారు. ముస్లిముల ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వబోనని చంద్రబాబు చెప్పారు. ఆయన చెబుతున్న మాటలకు విరుద్ధంగా, వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ సమర్థకురాలిగా ఉంది.
లౌకిక రాజకీయాల వారసత్వం కలిగి, బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంలో భాగస్వాములైనవారికి చాలా ఇబ్బందులున్నాయి. తమ విధానాలను, రాజకీయ అవసరాలను లేదా అవకాశవాదాన్ని బేలన్స్ చేయలేక ఆ పార్టీలు సతమతమవుతున్నాయి. కొన్నిపార్టీలు తమ ప్రత్యేకతలను నిలుపుకోగలుగుతున్నాయి. మరి కొన్ని నెమ్మదిగా, బిజెపి మార్గంలోకి జారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ, ఇటీవలి తీరుతెన్నులు చూస్తుంటే, గంగ చంద్రముఖిగా మారుతున్న క్రమం తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం లో దైవసేవల్లో అన్యమతస్థులు ఉండకూడదని, అది ఆలయ పవిత్రతకు భంగకరమని ఒక వాదన పది పదిహేనేళ్లుగా బలపడుతూ వచ్చింది. 2014-19 హయాంలోనే అందుకు తగ్గ నిర్ణయం తీసుకోవడానికి ప్రక్రియ మొదలుపెట్టింది. చివరి ఏడాది బిజెపితో తెగదెంపులు చేసుకున్నందున, అది అటకెక్కింది. తిరిగి ప్రస్తుత హయాంలో, అమలులోకి వచ్చేసింది. అన్య మత విశ్వాసులను గౌరవప్రదంగా ఇతర ప్రభుత్వ శాఖల్లోకి సర్దుబాటు చేస్తామని, సహకరించాలని చంద్రబాబు వారం రోజుల కిందట తిరుమలలో అన్నారు. ఈ సారి ఆయన ఇంత అర్జెంటుగా ఈ విధాన నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదు కానీ, పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు విషయంలో సృష్టించిన కలకలం బాబు మీద ఒత్తిడి తెచ్చింది.
లౌకిక రాజకీయాల వారసత్వం కలిగి, బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంలో భాగస్వాములైనవారికి చాలా ఇబ్బందులున్నాయి. తమ విధానాలను, రాజకీయ అవసరాలను లేదా అవకాశవాదాన్ని బేలన్స్ చేయలేక ఆ పార్టీలు సతమతమవుతున్నాయి. కొన్నిపార్టీలు తమ ప్రత్యేకతలను నిలుపుకోగలుగుతున్నాయి. మరి కొన్ని నెమ్మదిగా, బిజెపి మార్గంలోకి జారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ, ఇటీవలి తీరుతెన్నులు చూస్తుంటే, గంగ చంద్రముఖిగా మారుతున్న క్రమం తెలుస్తోంది.
ప్రాంతీయపార్టీల క్రమపరిణామంలో ఒక ముఖ్యమైన అంశం సిద్ధాంతాలకు తిలోదకాలు వదలడం. ప్రాంతీయ న్యాయవాదాన్ని , ఫెడరలిజాన్ని వదిలివేసిన తెలుగుదేశం పార్టీ, స్థాపకుడు ఎన్టీయార్ అనుసరించిన మతసామరస్య విధానాలను కూడా అవలీలగా విడిచిపెట్టింది. అయితే, తెలుగుదేశం పార్టీకి కీలకమయిన సామాజిక వర్గాలు, ఆర్థిక ప్రయోజన శక్తులు, ప్రజాశ్రేణులు, ఆంధ్రప్రదేశ్ లోని సాంస్కృతిక వాతావరణం మతతత్వ ఉన్మాదానికి ఏమంత అనుకూలమైనవి కావు. అందువల్ల, మతవాదులకు కొన్ని రాయితీలు ఇస్తే నష్టమేమిటి అన్న ధోరణి తెలుగుదేశం పార్టీలో నెలకొన్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకించడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోగూడదనే ఆత్రుత వల్ల, జగన్ మతం గురించి, ఆ కాలంలో క్రైస్తవ వ్యాప్తి గురించి, ఒక సెక్యులర్ పార్టీ మాట్లాడగూడని తీరులో చంద్రబాబు, ఆయన అనుచరులు మాట్లాడారు. ప్రభుత్వ స్థిరతకు ఏమాత్రం ప్రమాదం లేని ప్రస్తుత పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తే మరింతగా తన సొంతదనాన్ని నిలబెట్టు కోవచ్చును కానీ, మిత్రపక్షం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ధోరణి కొంత అభద్రతకు కారణమవుతోంది. తాను కూడా సనాతనవాద హిందువుగా, హిందూత్వ సమర్థకుడిగా కనిపించకపోతే నష్టమేమోనన్న ఆందోళనలో చంద్రబాబు కొంతకాలంగా ఉన్నారు. అట్లాగని, చేజేతులా తన రాజ్యంలో ఇతర రాజకీయాల ప్రాబల్యాన్ని పెంచాలని కూడా ఆయన కోరుకోరు.
నాలుగు నెలల కిందట విజయవాడలో విశ్వహి ందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో పెద్ద హైందవ సమ్మేళనం జరిగింది. పెద్ద సంఖ్యలో జనం దానికి హాజరయ్యారు. విజయవాడ వంటి వామపక్ష, అభ్యుదయ కేంద్రంలో అటువంటి సభకు అంతమంది రావడం విశేషమే. కొట్టొచ్చినట్టు కనిపించే మార్పులనే తప్ప, చాపకింద నీరులా జరిగే పరిణామాలను గుర్తించలేని మీడియా ఆ సభ ప్రాముఖ్యాన్ని గుర్తించినట్టు లేదు. పతాకశీర్షికలు కాదు కదా, మొదటిపేజీ కవరేజీ కూడా కష్టమే అయింది. చంద్రబాబు నాయుడే తన చేతిలోని మీడియాకు చెప్పి, కవరేజిని కనీసస్థాయికి కుదిం పజేశాడని బిజెపి, వి హెచ్పి శ్రేణులు సామాజిక మాధ్య మాలలో వ్యాఖ్యలు చేశారు. ఎక్కువగా ఎంకరేజ్ చేయకండి అని అధి కారగ ణానికి సూచనలు అందాయని రాజకీ యవర్గాల్లో కూడా వినిపించింది. విహెచ్పి సభకు ఏర్పాట్ల దగ్గర నుంచి తరలింపు దాకా పవన్ కళ్యాణ్, జనసేన చేసిన సహకారం అధికంగా ఉందన్న వార్తలు కూడా వచ్చాయి.
ఈ మధ్య ఒక శ్రేయోభిలాషి మిత్రుడు చంద్రబాబు నాయుడిని కలిశారట. ‘ ఇంత బలం ఉంది. మోదీకే మద్దతు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మీరు తలచుకుంటే చరిత్రనే సృష్టించగలరు. ఏమీ లేదు, ఒక్క పని చేయండి, సోలార్ ఇంధనం కుంభకోణంలో జగన్ కు ముడుపులు ముట్టాయని బయటకు వచ్చింది కదా, మీరు ఆ ఒప్పందాన్నే రద్దు చేయండి. ముడుపుల మీద విచారణ చేయించండి, మీకెంత పేరొస్తుందో చూడండి’, అని ఆ మిత్రుడు హితబోధ చేశారట. అంతా చిరునవ్వుతో విన్న చంద్రబాబు చేతులు జోడించి, ‘‘మీ సలహాకో దండం, నన్నిట్లా బతకనివ్వండి. ఇట్లా మునగచెట్టెక్కించి ఇంతకు ముందు ముంచారు. మళ్లీ నన్ను ఉబ్బించకండి. జగన్ తో ఫైట్ చేయడానికి అదానీతో బిజెపితో గొడవ పెట్టుకోవాలా? వాళ్లెన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో తెలుసునా? నాకు నాలుగు ఎంపీ సీట్లున్నాయని చెలాయించాలనుకుంటే, వాళ్ల చేతిలోఈడీలు సీబీఐలు అన్నీ ఉన్నాయి’’ అని నిష్కర్షగా చెప్పారట.
మరి, పవన్ ఎందుకు అంత వేగంగా హిందూత్వ వైపు, సనాతనం వైపు దూసుకుపోతున్నారు? అది అతని ప్రయోజనాలకు అనుకూలమై నదేనా? తానే కాక, తన సోదరుణ్ణీ పదవుల్లోకి తీసుకువెళ్లాలని తాపత్రయ పడుతున్న నాయకుడిని, కుటుంబ పాలనను వ్యతిరేకించే పార్టీ ఇష్టపడు తుందా? అసలు ఒక జనాకర్షణ కలిగిన ప్రాం తీయ నాయకుడు బిజెపి వ్యవస్థలో ఇమడగలుగుతారా? వంటి సందేహాలు అనేకం వస్తాయి. పిఠాపు రంలో పాకిస్థాన్ గురించి మాట్లా డడంలో అర్థం ఏమిటి? హిందీ వ్యతిరే కత లేదు సరే, అనుకూలత కూడా లేని చోట, దక్షిణాది సెంటిమెంటుకు వ్యతి రేకంగా మాట్లాడడంలో ప్రయోజనం ఏమిటి?
పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యూహం ప్రకారమే వ్యవహరిస్తూ ఉండవచ్చునని, ఆయన కూడా దీర్ఘకాలం బిజెపి గొడు గు కింద ఉండకపోవచ్చునని జనసేన ఆంతరంగికులు ఆశగా ఉన్నారు. విప్లవవాదం నుంచి చేగువేరా నుంచి సనాతనం వైపు రాగలిగినప్పుడు, రేపు అందుకు విరుద్ధంగా వ్యవహరించి కూడా మెప్పించగల శక్తి పవన్ కు ఉంటుందని ఆయన అభిమానుల నమ్మకం. బిజెపికి ఆంధ్రప్రదేశ్ లో స్థిరమైన పునాది లేదు. బ్రాహ్మణులు తప్ప ఒక సామాజిక వర్గం లేదు. పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సామాజికవర్గం, ఆయన సినీ అభిమానులు తమ ప్రభావంలోకి వస్తారని బిజెపి ఆశిస్తోంది.ఒక సామాజిక వర్గానికి, ఒకటిరెండు జిల్లాలకు నాయకుడిగా ముద్రపడిన తనకు, విస్తృతమైన ప్రజాపునాది ఏర్పడడానికి బిజెపి తోడ్పడుతుందని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. పైగా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అదుపులో ఉంచడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగ పడతారని కూడా బిజెపి భావిస్తోంది. 2018 లో ఎన్ డి ఎ నుంచి బయటకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, దాని నాయకులు బిజెపి మీద చేసిన తీవ్ర విమర్శలు, దూషణలు మోదీ, షాలు మరచిపో యారను కోలేము. చంద్రబాబు ఎన్డిఎ కు నమ్మకమైన మిత్రుడు కాదని బిజెపి అనుకుంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.
బిజెపి తనను నమ్మదని చంద్రబాబుకు తెలుసు. అందుకని అవసరం లేకున్నా, అతి వినయంగా ఉంటున్నారు. బిజెపి సొంతంగా ఏపీలో ఎప్పటికీ బలపడలేదని ఆయన నమ్ముతున్నారు కానీ, పవన్క ళ్యాణ్ తోనే తనకు ఇబ్బంది. రెండు ప్రత్యామ్నాయపార్టీల పద్ధతి ఏపీలో ఏర్పడితే మంచిదే, బాబు ఆలోచనల ప్రకారం ఆ రెంటిలో ఒకటిగా వైసీపీ కంటె జనసేన ఉంటే ఉత్తమమే. కానీ, ఇప్పుడు ఈ ఐదేళ్లు గడవడం ఒక్కటే సమస్య కాదు, వచ్చే ఎన్నికలలోపు లోకేశ్‌ను పీఠం మీద కూర్చో బెట్టడమో, కనీసం వారసత్వం ఖాయం చేయ డమో జరగడం చంద్రబాబుకు అవసరం. ఆ లక్ష్యానికి బిజెపి-జనసేన ఎక్కడ గండికొ డతాయో అని ఆయనకు భయం. పవన్ ఉండగా, ఆయనకు సరిసమాన స్థానం లోకేశ్కు ఇవ్వలేరు, తాను క్రియాశీలంగా ఉండగా లోకేశ్ కు ముఖ్యమంత్రి స్థానమూ ఇవ్వలేరు.
బిజెపికి ఆంధ్రప్రదేశ్ లో స్థిరమైన పునాది లేదు. బ్రాహ్మణులు తప్ప ఒక సామాజిక వర్గం లేదు. పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సామాజికవర్గం, ఆయన సినీ అభిమానులు తమ ప్రభావంలోకి వస్తారని బిజెపి ఆశిస్తోంది. ఒక సామాజిక వర్గానికి, ఒకటిరెండు జిల్లాలకు నాయకుడిగా ముద్రపడిన తనకు, విస్తృతమైన ప్రజాపునాది ఏర్పడడానికి బిజెపి తోడ్పడుతుందని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు.
జనసేనే తెలుగుదేశం పార్టీని గెలిపించిందని పవన్ కళ్యాణ్ జనోత్సాహంలో అన్నా, అందులో వాస్తవం ఉందని చంద్రబాబుకు తెలుసు. జనసేనకు వచ్చింది ఇరవయ్యొక్క సీట్లే అయినప్పటికీ, టిడిపి గెలిచిన 135 సీట్ల వెనుక ఆ పార్టీ పొత్తు బలం ఎంత ఉన్నదో ఆయనకు అవగాహన లేకపోలేదు. అటు మహారాష్ట్రలో బిజెపికి సొంతంగా మెజారిటీ లేకపోయినా, షిండేను, పవార్ ను విడివిడిగా అదుపులో పెట్టగలదు. అందుకే, తన విధానాలను కాదని అజిత్ పవార్ బీజేపీ బుల్డోజర్ విధానాలను సమ్మతించవలసి వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ సొంతంగా మూడింట రెండువంతుల మెజారిటీ ఉన్నా, ఎనిమిది స్థానాల బిజెపికి టిడిపి భయపడుతున్నది. తన మద్దతు మీదనే కేంద్రప్రభుత్వం ఆధారపడి ఉన్నా, అందుకు తగ్గ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నది. అంకెలకు మించిన బలం ఏదో దేశంలో సర్వంసహాధికారం చెలాయిస్తున్నదని అర్థం అవుతోంది.
ఈ మధ్య ఒక శ్రేయోభిలాషి మిత్రుడు చంద్రబాబు నాయుడిని కలిశారట. ‘ ఇంత బలం ఉంది. మోదీకే మద్దతు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మీరు తలచుకుంటే చరిత్రనే సృష్టించగలరు. ఏమీ లేదు, ఒక్క పని చేయండి, సోలార్ ఇంధనం కుంభకోణంలో జగన్ కు ముడుపులు ముట్టాయని బయటకు వచ్చింది కదా, మీరు ఆ ఒప్పందాన్నే రద్దు చేయండి. ముడుపుల మీద విచారణ చేయించండి, మీకెంత పేరొస్తుందో చూడండి’, అని ఆ మిత్రుడు హితబోధ చేశారట. అంతా చిరునవ్వుతో విన్న చంద్రబాబు చేతులు జోడించి, ‘‘మీ సలహాకో దండం, నన్నిట్లా బతక నివ్వండి. ఇట్లా మునగచెట్టెక్కించి ఇంతకు ముందు ముంచారు. మళ్లీ నన్ను ఉబ్బించకండి. జగన్ తో ఫైట్ చేయడానికి అదానీతో బిజెపితో గొడవ పెట్టుకోవాలా? వాళ్లెన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో తెలుసునా? నాకు నాలుగు ఎంపీ సీట్లున్నాయని చెలాయించాల నుకుంటే, వాళ్ల చేతిలోఈడీలు సీబీఐలు అన్నీ ఉన్నాయి’’ అని నిష్కర్షగా చెప్పారట. కాబట్టి, ఎపీలో ఉన్నది సామాన్య స్థితిగతులు కావు. అధికారపార్టీ అక్కడ అత్యంత బలమైన స్థితిలో ఉన్నా కొన్నివిషయాల్లో అత్యంత బలహీన పార్టీ కూడా అదే. ఎక్కడా లేని విధంగా, అక్కడ అధికారపార్టీ, మిత్రపక్షం, ప్రతిపక్షపార్టీ అన్నీ బిజెపికి విధేయమైనవే. అదానీతో అనుబంధంలోనివే.