-చనిపోయిన, అడ్రస్ మారిన వారి వోట్లు మాత్రమే తొలగింపు
-ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్20:తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి సర్ పక్రియ ప్రారంభం అవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 15 నుంచి జూన్24 వరకు సన్నాహక పక్రియ జరుగుతుందని.. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫాం అందజేసే పక్రియ కొనసాగుతుందని చెప్పారు. మిస్ అయిన వారికి ఫాం 6తో మరోమారు ఎన్యూమరేట్ ఫాం అందజేసే అవకాశం ఉందన్నారు. జులై 31న వోటర్ల డ్రాప్ట్ జాబితా విడుదల చేస్తామని, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 1న తుది వోటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు సీఈవో వెల్లడించారు. వోటరు జాబితాలో ప్రస్తుతం ఎక్కడ వోటు ఉందో అదే అడ్రస్‌కు ఎన్యూమరేషన్ ఫాం వస్తుందని సీఈవో తెలిపారు. ఆ అడ్రస్‌లో వోటరు లేకపోతే అతని వోటు అక్కడ తొలగించబడుతుందన్నారు. ప్రస్తుతం ఉంటున్న అడ్రస్‌తో మళ్లీ వోటరు ఫాం8తో వోటును ఎన్‌రోల్‌మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. సర్ ప్రధాన ఉద్దేశం వోటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమని.. వోటర్లను తొలగించడం కాదని స్పష్టం చేశారు. 24 ఏళ్లుగా ఇక్కడ వోటర్ జాబితా ప్రక్షాళన జరగలేదన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది మృతి చెంది ఉంటారని.. కొందరు వలస వెళ్లి ఉంటారని తెలిపారు. వాటన్నింటినీ సరి చేయడమే సర్ ఉద్దేశమని చెప్పారు. ఇందులో రాజకీయ ప్రేరేపితం ఏ ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరునికి ఎన్యూమరేషన్ ఫాం ఇస్తారని తెలిపారు. కులం, మతంతో సంబంధం లేకుండా అందరికీ ఫాం ఇస్తారన్నారు. ఎన్యూమరేషన్‌లో ముస్లిం, హిందూ అనే వ్యత్యాసం ఉండదని చెప్పారు. ఒక వర్గం వోట్లు తొలగిస్తారనే ఆందోళన అవసరం లేదని సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.