నరహరి లాకర్లలో భారీగా డబ్బులు

– రూ.కోటిన్నర నగదు స్వాధీనం
– రెండున్నర కిలోల బంగారు ఆభరాణాలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌ల్యాండ్స్ అం‌డ్‌ ‌సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ ‌సుంకరి నరహరి లాకర్లలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నరహరిపై అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు నేపథ్యంలో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలో నరహరికి సంబంధించిన బ్యాంకు లాకర్లను బద్దలు కొట్టి కీలక ఆధారాలను సేకరించారు. నరహరి కుటుంబ సభ్యులు లాకర్‌ ‌తాళాలను అందించేందుకు నిరాకరించడంతో న్యాయస్థానం అనుమతితో ఏసీబీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోర్టు జారీ చేసిన సెర్చ్ ‌వారెంట్‌ ఆధారంగా బ్యాంకు అధికారుల సమక్షంలో లాకర్లను బద్దలు కొట్టి తనిఖీలు నిర్వహించారు. లాకర్‌లో రూ.1.50 కోట్ల నగదుతోపాటు సుమారు రెండున్నర కిలోల బంగారం లభించింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువను అధికారులు అంచనా వేస్తున్నారు. లాకర్లలో దొరికిన నగదు, బంగారానికి సంబంధించిన పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు రికార్డులు, పన్ను వివరాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *