– మరో వారం రోజులు పొడిస్తూ ఈసీ ఆదేశాలు
– ఆగస్ట్ 10 వరకు పొడిగించినట్లు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31: కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని మరోమారు పొడిగించింది. ఆగస్టు 10వ తేదీ వరకు వోటర్లు తమ వివరాలను బీఎల్వో లకు అందజేయాలని స్పష్టం చేసింది. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి వోటర్ల వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 17న డ్రాప్ట్ పబ్లికేషన్‌ను విడుదల చేస్తామని సెప్టెంబర్ 16వ తేదీ వరకు కెయిములు, అభ్యంతరాలను స్వీకరిస్తామని వివరించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు క్లెయిములను అభ్యంతరాలను పరిష్కరిస్తామని, అక్టోబర్19న ఫైనల్ పబ్లికేషన్‌ను విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణలో వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఆగస్టు 3న ముగియాల్సిన గడువును 10వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ గడువు జులై 24 వరకే ఉండగా ఆగస్టు 3కు పొడిగించారు. తాజాగా ఆ తేదీని ఆగస్టు 10కి మార్పు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 77.12 శాతం ఎన్యూమరేషన్ పూర్తయిందని ఈసీఐ తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో 56.31 శాతం, రంగారెడ్డిలో 63.43, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం పూర్తయినట్లు పేర్కొంది. ఇదిలావుంటే కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ నవీన్ కుమార్ తెలంగాణలో పర్యటించారు. సర్ పక్రియను సమీక్షించేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చారు. అంతకుముందు ఆయనకు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వాసం వెంకటేశ్వర రెడ్డి స్వాగతం పలికారు. నవీన్ కుమార్ సుదర్శన్‌రెడ్డితో రాష్ట్రంలో జరుగుతున్న ’సర్’ పక్రియ పురోగతిపై చర్చించారు. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎలక్షన్ ఆఫీసుకు వెళ్లి అధికారులతో మాట్లాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





