దేశంలో బీజేపీకి కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే భావన, అతి విశ్వాసం నుంచి బయటపడాలి. బీజేపీని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయ కూటమే శరణ్యం.. సిద్ధాంతాలకు రాష్ట్రాలకతీతంగా ప్రాంతీయ పార్టీల ఏకీకరణ జరగాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం కంటే ప్రత్యామ్నాయ లీడర్ షిప్ అవసరం..రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఈగోలకు పోకుండా బలమైన నేతకు బాధ్యత అప్పగిస్తే తప్ప కాషాయోన్మాద మేఘ గర్జన నుంచి దేశం బయటపడితేనే మళ్ళీ వసంత మేఘం గర్జిస్తుంది.
దేశంలో ఒకప్పుడు వసంత మేఘాలు గర్జించాయి, ప్రజలను చైతన్యం చేసింది..జనాలను ఐక్యం చేసింది..పీడితులను సమీకరించి..ప్రజా పోరాట వర్షం కురిపించింది. పోరాట యోధులకు పురుడు పోసింది..దీంతో దేశంలో అభ్యుదయం వికసించింది..విజ్ఞానంతో శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశం అభివృద్ధి చెందింది.
కొంతకాలంగా దేశంలో మతోన్మాద మబ్బులు కమ్ముకొస్తున్నాయి..వికసిత్ భారత్ ముసుగులో మతోన్మాద కారు మబ్బులు అమావాస్యాంధకారం కమ్మేస్తోంది. అజ్ఞాతం, అంధ విశ్వాసాలు, మతోన్మాద జల్లులు ప్రజలపై అమవాస్య ముబ్బులు కురిపిస్తున్నాయి. .ప్రజలు చైతన్యం కాకుండా, అభ్యుదయం వికసించకుండా మత వర్షాన్ని కురిపిస్తుంది. ఆ మతోన్మాద రక్తపు వరదల్లో ప్రజలు కొట్టుకుపోతున్నారు. కారు చీకట్లను చీల్చుకుంటూ వసంత మేఘ గర్జన దేశంలో వెలుగు నింపితే, అజ్ఞానాంధాకారం మతోన్మాద మేఘ గర్జనతో బీజేపీ దేశాన్ని చీకట్లోకి నెట్టేస్తోంది.
కమలం పార్టీ దేశాన్ని పూర్తిగా కాషాయికరించింది. ఒక్కొక్క ఎన్నికను ఒక్కొక్క మెట్టుగా మల్చుకుంటుంది. ఒక్కో గెలుపును లక్ష్యానికి దగ్గర అయ్యేలా మార్చుకుంటుంది…దేశంలో బీజేపీ రోజు రోజుకు బలోపేతం అవుతుంది. ఎన్నిక ఎన్నికకు తన బలాన్ని పెంచుకుంటోంది.. చాపకింద నీరులా విస్తరిస్తు ఒక్కొక్క రాష్ట్రాన్ని భాజపా కైవసం చేసుకుంటుంది..ఒక్కొక్క ఎన్నికను ఒక్కొక్క మెట్టుగా మార్చుకుంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలన్న తేడా లేకుండా మోదీ దగ్గర నుంచి బూత్ ఇంచార్జ్ వరకూ ప్రతి ఎన్నికను ఒక యుద్ధంగా తీసుకుంటుంది.
కాషాయ పార్టీ మొదటి నుంచి మత రాజకీయాలను నమ్ముతుంది. మండల్ రాజకీయాలతో కుల పార్టీ లు పురుడు పోసుకుంటే, మత, కమాండల్ పాలిటిక్స్ పునాదులపై బీజేపీ విస్తరించింది. మతోన్మాదం, మూకోన్మాదం, భావోద్వేగాలతో వోట్ల సాగుచేస్తొంది. ప్రతి ఎన్నికలో కమలం వికసిస్తుంది. భాజపా ప్రతి గెలుపు దేశ ఫెడరల్ వ్యవస్థను బలహీనపర్చుతుంది..ప్రతి విజయం దేశాన్ని హిందు రాజ్‌గా మార్చేందుకు బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది.
ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ ఎంతైకైనా పోరాటం చేస్తుంది.మోదీ,షాలు ఎక్కడికైనా వెళుతున్నారు. గెలుపును ముద్ధాడేందుకు ఎన్నీ ఫీట్లు అయిన వేస్తారు. కాంగ్రెస్ వదిలి పెడుతున్న గ్యాప్ ను బీజేపీ పూడ్చుతు రాష్ట్రాలను బట్టి సవేశాలు. వోటర్లను ఆకర్షించే ప్రసంగాలు చేస్తారు. ఏ వర్గం ప్రజల్లోకి బీజేపీ వెళ్ళాలో ఆ వర్గం జనాలను ఆకట్టుకునేలా ప్రచార వ్యూహాలు అమలు చేస్తారు. ప్రచారంలో మోదీ షాలను బీజేపీ ఎత్తులను అంచనా వేయడం, అందుకోవడం దేశంలో ఏ జాతీయ ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాదు. గెలుపు ఆశలు సన్నగిల్లిన చోటే బీజేపీ గెలుపు వ్యూహాలు రచిస్తోంది. అందుకే అతి తక్కువ కాలంలోనే రెండు ఎంపీ స్థానాల నుంచి ఇవాళ పార్లమెంట్ ను శాసిస్తూ రాజ్యాంగాన్ని ధిక్కరించే స్థాయికి ఎదిగింది.
.ఇవాళ దేశం కాషాయికరణ జరుగుతుందంటే 70 శాతానికి పైగా రాష్ట్రంలో బీజేపీ ప్రత్యేకంగా, మిగతా రాష్ట్రాల్లో పరోక్షంగా భాజపా అధికారంలో ఉండటం కారణమైతే, మత రాజకీయాలు ఎంత కారణమో.. అంతకంటే ఎక్కువ రాజ్యాంగ వ్యవస్థలను ఎన్నికల పావుగా వాడుకోవడం బీజేపీ 21వ శతాబ్దపు నయా పాలిటిక్స్ మరో కారణం.
దేశంలో పార్లమెంట్ ఎన్నికలైన, తప్పనిసరిగా గెలవాల్సిన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలైన ప్రతి సందర్భంలోనూ ఎన్నిక ముందు దేశంలో ఉగ్రదాదులు జరుగుతున్నాయి.మత ఘర్షణలు జరుగుతాయి. ప్రతి పోలింగ్ కూడా మత పోలరైజేషన్ కేంద్రంగా జరుగుతుంది. ప్రతి వోటు వన్ కంట్రీ వన్ ప్రభుత్వమన్న కాషాయ పార్టీ ఆలోచనకు బలం చేకూర్చుతుంది. అలాంటి భౌతిక పరిస్థితిని కాషాయ పార్టీ కల్పిస్తుంది.ఇది యాదృశ్చికమో మరేదోకాదు.ఇది ప్రీ ప్లాన్ గా కనిపిస్తుంది.
.ఒక వైపు దేశంలో కాషాయ పార్టీ విస్తరణ వేగంగా జరుగుతుంటే మరో వైపు కాంగ్రెస్ పార్టీ పతనం అంతే వేగంగా జరుగుతోంది. బీజేపీ సక్సెస్ కావడంలో కాంగ్రెస్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. గాంధీ కుటుంబం చుట్టూ పార్టీ కేంద్రీకృతం కావడం, గాంధీ వారసురాలు తప్ప మరో నేతను కాంగ్రెస్ లీడర్ గా అంగీకరించకపోవడం, రాహుల్ గాంధీ తన నాయకత్వాన్ని నిరూపించుకోవడంలో వరుసగా విఫలం కావడం, ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెసేతర వ్యక్తి ఉన్న పార్టీపై గాంధీ ఫ్యామిలీ గుత్తాధిపత్యం కొనసాగించడం, మోదీని ఢీ కొట్టే చరిష్మా, ప్రజా మద్దతు ఉన్న నేత కాంగ్రెస్ లో లేకపోవడం ఆ పార్టీ బలహీనత.
.బీహార్‌లో ఎన్డీయే గెలుపు దేశంలో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందనే సంకేతం వెలుబడుతున్నాయి. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన మండల్ పాలిటిక్స్ ఇప్పుడు పతనావాస్థకు చేరింది. బీజేపీ మత పాలిటిక్స్ ను వేగంగా విస్తరిస్తుండటంతో కుల రాజకీయాలకు కాలం చెల్లినట్లైతుంది. మండల్ పార్టీలకు పుట్టినిల్లైన యూపీ , బీహార్‌లో ఎస్పీ, ఆర్జేడీ వంటి కుల పార్టీలు ఇవాళ అంపశయ్యపై ఉన్నాయి. కుల రాజకీయాలకు పోటీగా కమాండల్ పాలిటిక్స్ తీసుకువచ్చిన బీజేపీ తాజాగా బీహార్‌లో ఏకపక్ష విక్టరీ సాధించడంతో ఇక దేశంలో కుల పార్టీలకు కుల రాజకీయాలకు ముగింపు పడిందన్న చర్చ జరుగుతుంది. మండల్ పార్టీలు కూలిపోతూ, కమండల్ రాజకీయాలకు బలం పెరుగుతుంది.
కుల పార్టీలను, లోకల్ పార్టీల పునాదులు కదులుతున్నాయి. మత రాజకీయాలు, హిందు ముస్లీం పోలరైజేషన్ తో ప్రాంతీయ వాదాన్ని మోదీ బలహీనపర్చుతున్నారు. దేశ భక్తి, భావోదేగ్వేవాలతో అస్థిత్వవాద పార్టీలను భవిష్యత్ లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ భుజాలపై తుపాకీ పెట్టి బీజేపీ ప్రాంతీయ పార్టీలను కాల్చుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..ఈస్ట్ నుంచి వెస్ట్ వరకూ ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొరకంగా లోకల్ పార్టీలను మోదీ షా లు భూ స్థాపితం చేస్తున్నారు. జమ్ములో ముఫ్తీ, యూపీలో మాయవతి, ఎస్పీ, ఉత్తరాదిలో ఆప్, సౌత్‌లో బీఆర్ఎస్, నవీవ్ పట్నాయక్ , వైసీపీ, కర్నాటకలో జేడీయూ, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, పంజాబ్‌లో ఆకాళీదల్ ఇప్పుడు బీహార్‌లో ఆర్జేడీ పార్టీలను బీజేపీ నిర్వీర్యం చేస్తుంది.
దేశంలో కాంగ్రెస్‌తో కలిసినడుస్తున్న పార్టీలకు మోదీ రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తున్నారు. ప్రత్యేక్షంగా దీదీతో కలిసి బెంగాల్‌లో లెఫ్ట్ పార్టీని, ఏపీలో బాబుతో కలిసి జగన్‌ను..కర్నాటకలో జేడీయూతో కలిసి కాంగ్రెస్‌ను బలహీనపర్చితే, పరోక్షంగా తెలంగాణలో రేవంత్‌తో కలిసి బీఆర్ఎస్‌ను, దిల్లీలో ఆప్‌ను, అసోంలో నవీన్ పట్నాయక్, మాయవతి,శరద్ పవర్, ఎస్పీ, ఇప్పుడు జేడీయూను బలహీనపర్చించి ప్రాంతీయ పార్టీలను రాజకీయ సమాధి చేస్తున్నారు. కొన్నిచోట్ల పరోక్షంగా కాంగ్రెస్‌తో కలిసిన కమ్యూనిస్టుల అస్థిత్వంపై మోదీ దెబ్బకొట్టుతున్నారు.
ప్రాంతీయ పార్టీలతో తోక పార్టీగా జతకట్టి, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు బీజేపీ పరివర్తనం చెందుతుంది మహారాష్ట్ర, కర్ణాటకలో అదే జరిగింది భవిష్యత్‌లో ఏపీలో కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయి.అదే టైంలో కాంగ్రెస్‌లో తిరుగుబాటు నేతలను ప్రోత్సహిస్తూ హస్తాన్ని చీల్చుతుంది.అసోంలో హేమంత బిస్వా శర్మ, బెంగాల్‌లో సువేంద్ అధికారి కాంగ్రెస్ దాని మిత్రపక్షంలో ఉంటూనే పార్టీని బలహీనపర్చారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని కూడా మోషాలు వ్యూహాత్మకంగా ఎంకరేజ్ చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది.
బీజేపీ రాజకీయ దూకుడు ముందు కాంగ్రెస్ నాయకులు తలొంచుతున్నారు. రాహుల్‌తో పోటీ పడి పని చేయలేకపోతున్న పీసీసీలు, కాంగ్రెస్ నేతలు మోదీ షాకు దాసోహం అవుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీని సమాధి కట్టుతున్నారు. కాంగ్రెస్ వల్ల స్థానిక పార్టీలు సమాధి అవుతు, కమల వికాసం జరుగుతున్నట్లు కళ్లముందు కనిపిస్తుంది.
వరుస ఓటములతో కాంగ్రెస్ భవిష్యత్ అంధకారంగానే కనినిస్తుంది. గాంధీ పరివార్ భజన నుంచి కాంగ్రెస్ బటయకు రాకపోవడంతో భవిష్యత్‌లో ఆ పార్టీ కనుమరైన ఆశ్చర్యం లేదు. రాహుల్ పోరాటాన్ని టీపీసీసీలు ముందుకు తీసుకుపోకుండా బీజేపీకి జీ హుజూర్ అనడంతో పార్టీ పతనం వేగంగా జరుగుతుంది..జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో ద్వంద విధానాలు అమలు చేస్తుండటంతో కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు.
దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి జాతీయ పార్టీకి తక్కువ ప్రాంతీయ పార్టీకి ఎక్కువ అన్నట్లు తయారైంది. ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్ట్‌లు కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుంటేనే వాటికి భవిష్యత్ ఉంటుంది.లేకపోతు కుక్కతోకపట్టుకుని గోదారి ఈదినట్టే ఉంటుంది. దేశంలో బీజేపీకి కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే భావన, అతి విశ్వాసం నుంచి బయటపడాలి. బీజేపీని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయ కూటమే శరణ్యం.. సిద్ధాంతాలకు రాష్ట్రాలకతీతంగా ప్రాంతీయ పార్టీల ఏకీకరణ జరగాలి..ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం కంటే ప్రత్యామ్నాయ లీడర్ షిప్ అవసరం..రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఈగోలకు పోకుండా బలమైన నేతకు బాధ్యత అప్పగిస్తే తప్ప కాషాయోన్మాద మేఘ గర్జన నుంచి దేశం బయటపడితేనే మళ్ళీ వసంత మేఘం గర్జిస్తుంది.





