పునరుజ్జీవన దశ

ద్రావిడ సాహిత్యోద్యమం ప్రస్తుతం పునరుజ్జీవన దశలో ఉందనుకొంటున్నాను. ఇది సాంప్రదాయక ద్రావిడసాహిత్యం, తత్వం, సంస్కృతిపట్ల, యువతలో కొత్త ఆసక్తిని కలిగిస్తోంది. ద్రావిడతత్వం, సంఘ సంస్కరణలు, భాషా ఉద్యమాల చరిత్ర గురించి చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. నూతన ద్రావిడ సాహిత్య చైతన్యం స్పష్టంగా మొలకెత్తుతోంది. అయినప్పటికీ, ఇది స్థిరమైన, సృజనాత్మకమైన మరియు ప్రభావవంతమైన సాహిత్యోద్యమంగా రూపుదిద్దుకునే ప్రక్రియ ఇంకా జరగవలసి ఉంది. యువ రచయితలు, బౌద్ధికులు ఈ చైతన్యాన్ని కొత్త సాహిత్యరచనలు, సిద్ధాంతాల ద్వారా ఎలా ముందుకు తీసుకెళతారో చూడాల్సి వుంది.

మారుతి పౌరోహితం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *