ఒక గొప్ప మానవతావాది ని కోల్పోయాం

  • రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు..:
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, అక్టోబర్ 10 : ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా.. ఇక మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా వారు ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *