కులగణనపై సంప్రదింపుల సదస్సుకు హాజరు..
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణనకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ బోయిన్‌పల్లి లోని గాంధీ నాలెడ్జ్ సెంటర్ లో కులగణనపై సంప్రదింపుల సదస్సును మంగళవారం నిర్వహించనుంది. అయితే, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు రాహుల్ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. కాగా, రాహుల్ గాంధీ మహారాష్ట్ర, జార?ండ్ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే బిజీబిజీగా ఉన్నారు. దీంతో కేవలం గంట సేపు మాత్రమే కులగణన సంప్రదింపుల సమావేశంలో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పర్యటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు.