మురుగు వర్షపు వరద ఇతర నీరు రోడ్డులపై నిరంతరాయముగా పారడానికి రవాణాకు అంతరాయం లేకుండా జరగడానికి వంతెనలు భూగర్భ కాలువలు నిర్మిస్తుంటారు. ఇందులో పని చేసే కార్మికులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తమ విధులను నిర్వహిస్తుంటారు. భయంకరమైన దుర్వాసన మనుషుల మల విసర్జన ప్రవాహంలో పనిచేస్తూ నిర్మిస్తుంటారు.
వీరికి దుర్వాసన నుండి అరికట్టడానికి ముఖానికి మాస్కులు చేతులకు గ్లౌజులు కాళ్ల రక్షణకు పొడవైన బూట్లు ఉండవు. దుర్భర దయనీయమైన స్థితిలో దాదాపు పది గంటల పైననే పని చేస్తుంటారు. విధులు నిర్వహిస్తున్నప్పుడు సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ల నుండి సరియైన పర్యవేక్షణ కనపడదు. ఆశ్చర్యకరమైన విషయం ఈ పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు విపరీతమైన వ్యయాలు వీటిని నిర్వహించే రాజకీయ నాయకులకు అధికారులకు ఎర్ర తివాచీ పూల దండలతో అలంకరణ సుందరకమనీయమైన దృశ్య కావ్యంగా నిర్వహిస్తారు.
శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. శంకుస్థాపనలప్పుడు గడ్డపారలకు, పారలకు, తట్టలకు రంగుల పూలతో అలంకరణ ప్రారంభోత్సవాలకు ఉపయోగించే కత్తెరను కూడా అందంగా అలంకరిస్తారు కానీ నిర్మాణ కార్మికులకు ఎలాంటి రక్షణ కవచాలు ఉండవు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో తప్పకుండా కార్మికులకు అత్యంత నాణ్యమైన తగు రక్షణ పరికరాలు సమకూర్చటకు పొందుపరచాలి మరియు వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని పనులు నిర్వహించే సమయంలో తప్పకుండా వీటిని ధరించే విధముగా చర్యలు తీసుకోవాలి. వారు ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే ఈ పనులలో నాణ్యత మెరుగుగా ఉంటుంది. ఆర్భాటాలకు ఖర్చులు పెట్టకుండా ఈ నిర్మాణాలకు వెచ్చిస్తే నాణ్యత కాలపరిమితి అధికంగా ఉంటుంది.
దండంరాజు రాంచందర్ రావు
9849592958





