బాలల హక్కులను కాపాడటం అందరి బాధ్య‌త

– డాక్టర్ అనితా రెడ్డి

వరంగల్, ప్రజాతంత్ర, జ‌న‌వ‌రి 9ః నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి సంబరాలను  పురస్కరించుకుని వరంగల్ ఆటోనగర్ లోని జువెనైల్ హోమ్ (బాలుర పరిశీలన గృహం)ను శుక్రవారం సందర్శించి పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్స్, స్నాక్స్  అంద‌జేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడటం అందరి బాధ్య‌త అని, పిల్లలకు అందమైన బాల్యాన్ని బహుమతిగా అందించాలని అన్నారు, వివిధ కారణాల చేత ఇక్కడ ఉన్న పిల్లలకు మంచి నడవడిక  నేర్పాల‌ని, వారిలో మార్పున‌కు ఎంతో ఓర్పు తో, ప్రేమ తో వ్యవహరించాలని సూచించారు. పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యా సౌకర్యాలు, ఆరోగ్య సౌకర్యాలు అందించాలని, భ‌ద్రతతో కూడిన బాల్యం ఇవ్వాలని తెలిపారు, పిల్లల హక్కులను కాపాడటంలో తనవంతు కృషి చేస్తాన‌న్నారు. పిల్లల హక్కులను  కాపాడటం, చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా మార్చడానికి సమ‌ష్టి కృషి చేయాలని కోరారు. పిల్లల హక్కులకు భంగం కలిగిస్తే జేజే చట్టం ప్రకారం శిక్షార్హులవుతారన్నారు, భ‌ద్రతతో ఎదిగేందుకు అందరం బాసటగా నిలుద్దామ‌ని, పిల్లల హక్కులను కాపాడుతాం అని, ఏ పిల్లలు బడి బయట ఉండకుండా చూస్తామని, బాల్యవినాహలు, చైల్డ్ లేబర్ వ్యవస్థను రూపుమాపుతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని డాక్టర్ అనితా రెడ్డి కోరారు. జువెనైల్ హోం సూపరింటెండెంట్ రమణమూర్తి, వినయ్, రాధ సిబ్బంది పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page