జ‌ర్న‌ల్ రూపొందించ‌డం అభినంద‌నీయం

– ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 10: జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ రూపొందించిన ప్రెస్ క్లబ్ జర్నల్ ను మంత్రి సచివాలయంలో శనివారం ఆవిష్కరించారు. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ప్రతినెలా ప్రెస్ క్లబ్ జర్నల్‌ను రూపొందించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ జర్నల్‌లో జ‌ర్న‌లిస్టులకు సంబంధించిన సమకాలీన అంశాలు పొందుపరచడం సంతోషకరమని పొంగులేటి అన్నారు. ప్రెస్ క్లబ్ నూతన పాలకమండలి ఏర్పడి మూడు నెలలు అయినప్పటికీ జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను రూపొందించామని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయకుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల మంత్రికి వివరించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని, ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్ల బ్ ఉపాధ్యక్షులు ఏ రాజేష్, అరుణ అత్తలూరి, జాయింట్ సెక్రటరీ చిలుకూరు హరిప్రసాద్, కోశాధికారి రమేష్ వైట్ల, కార్యవర్గ సభ్యులు శంకర్ శీగ,ఎన్ఉ.మాదేవి, రచన ముడుంబై, వనం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page