నేటినుంచి పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

  • ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
  • సమావేశాలపై ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహణ
  • విపక్షాలకు వక్ఫ్ ‌తదితర బిల్లుల జాబితా అందజేత

పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు శుక్రవారం  నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత  సభలు వాయిదా పడతాయి. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ ‌ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలోనే గురువారం  అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రులుపలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈసందర్భంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్ ‌సవరణ బిల్లు  కూడా ఉంది. బడ్జెట్‌ ‌సమావేశాల్లోనే వక్ఫ్ ‌సవరణ బిల్లును పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఆ జాబితాను అఖిలపక్షం ముందు ఉంచింది. వక్ఫ్ ‌చట్ట సవరణపై గతంలో కేంద్రం జేపీసీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

వక్ఫ్ ‌చట్టంలో మార్పుల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఇటీవల సవరణ బిల్లును  ఆమోదించిన సంగతి తెలిసిందే. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి.. తాజాగా లోక్‌సభ స్పీకర్‌కు అందించింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతజవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితేఈ సవరణలపై విపక్షాలు అసమ్మతి తెలిపాయి. ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులపై దాడికే ఈ బిల్లును తెచ్చారనివక్ఫ్‌బోర్డుల పనితీరులో జోక్యం చేసుకోవడమే ప్రభుత్వం అసలు ఉద్దేశమని విపక్ష సభ్యులు ఆరోపించాయి.

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి జేపీ నడ్డాకిరణ్‌ ‌రిజిజుఅర్జున్‌ ‌రామ్‌ ‌మేఘ్వాల్‌ ‌తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ ‌నుంచి ఎంపీ జైరామ్‌ ‌రమేశ్‌‌గౌరవ్‌ ‌గగోయ్‌ ‌సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించారు. పార్లమెంట్‌ ‌సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్న విషయం తెలిసిందే. తొలి విడత సమావేశాలు 31 నుంచి మొదలై.. ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. ఇక రెండో విడుత సమావేశాలు మార్చి 10న మొదలై.. ఏప్రిల్‌ 4 ‌వరకు కొనసాగుతాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం అయిన అరగంట తర్వాత.. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page