ఎప్పటికీ
మాట తప్పదు
నా కోరిక
ఎంత దూరంలో ఉన్నా
పాతకాలం నాటి
ఏ ఇష్టాన్ని గాయపరచుకోదు
ఎద తలుపు తట్టి
పిలవాలే గాని
బదులు పలికేందుకు
ఏ లోతుకు అలసటుండదు
ఎదుటపడి
ఏరుకునే ఆలోచన
ఉండాలేగానీ
ఏ అర్ధం అడ్డుగోడకాలేదు
ఒక్కో క్షణం
ఒక్కో కోరికలా
గతాన్ని చదివించి
భవిష్యత్తుని బోధిస్తుంది
-చందలూరి నారాయణరావు




