- 31 మంది మావోయిస్టులు… ఇద్దరు జవాన్లు మృతి
- ఇద్దరు జవాన్లకు గాయాలు
- గాలింపు చర్యలు చేపట్టిన భద్రత బలగాలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
భద్రాచలం ,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 09 : తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ లో మరోసారి కాల్పులు మాత్రం మోగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురెదురు కాల్పులు జరిగాయి ఈ సంఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి ఇద్దరు జవాన్లు మరో ఇద్దరు జవాన్లకు గాయాలు.. భద్రత బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ లో పోలీసులకు మావోయిస్టులకు జరిగాయి. ఈ సంఘటనలో 31 మంది మావోయిస్టుల మృతి. చెందారు.
2 భద్రత జవాన్లు మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.మరదల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు ఇదిలా ఉండగా 6వ తేదీన గురువారం నాడు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టు మృతి చెందారు ఈ సంఘటన మరొక ముందే ఆదివారం నాడు చత్తీస్ ఘడ్ ప్రాంతంలో కాల్పులు మోత మోగింది.
తరచుగా భద్రతా బలగాలు చేతులో మావోయిస్టులు భారీగా మృత్యువాత పడుతున్నారు .దీంతో మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడుతుంది. అలాగే జనవరి నెలలో బీజాపూర్ జిల్లాలోని 12 మంది మావోయిస్టులను మావోయిస్టు పార్టీ కోల్పోయింది.
ఆయన కౌంటర్లు అగ్ర నేతలతో సహా మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా జనవరి 21న ఘరియబాద్ ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాన్ని నలుదిక్కుల చుట్టుముట్టి మావోయిస్టు పార్టీని అంతమందిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.