కొత్త ఏడాదిలో మహా కుంభమేలా!

కొత్త ఏడాదిలో  కుంభమేలా పలకరించబోతున్నది. అయితే ఇక్కడ మార్గదర్శకాలు ఇప్పుడు చర్చగా మారాయి. ప్రయాగ్‌రాజ్‌లోని మహా  కుంభమేలా మరోసారి వార్తల్లో నిలిచింది. కొత్త సంవత్సరంలో జరగనున్న మహా  కుంభమేలాలో సనాతనయేతరుల ప్రవేశాన్ని అఖారా పరిషత్‌ నిషేధించిన తరువాత, ఇప్పుడు నాగ సన్యాసులు కూడా కొత్త మార్గదర్శకాలను వెల్లడిరచారు.  ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. సనాతనేతరులు ఎవరైనా మన సంస్కృతితో ఆటలాడినా లేదా జాతర ప్రాంతంలోకి ప్రవేశించినా వారిని పట్టుకుని కఠిన శిక్షలు వేస్తామని స్పష్టం చేశారు. ఈ సమస్యపై తామే చర్యలు తీసుకోగలమని నాగ సన్యాసులు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా సనాతనేతరులు మహాకుంభంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు అఖారా పరిషత్‌ ప్రకటించింది. ఇప్పుడు నాగ సన్యాసులు.. అఖారా పరిషత్‌ ప్రకటనకు మద్దతిచ్చి దాన్ని అమలు చేసే దిశగా గట్టి అడుగులు వేశారు.

మహా  కుంభమేలాలో పాల్గొనే వారు నుదుటిపై తిలకం, మణికట్టుపై కాలవ తప్పనిసరి అని.. సందర్శకుల మహా  కుంభమేలా ప్రాంతంలోకి ప్రవేశించడానికి ఇవి ఉన్నవారికి మాత్రమే అనుమతించబడతారని స్పష్టం చేసింది. హిందూ మతాన్ని భ్రష్టు పట్టించే ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు జునా అఖారాకు చెందిన నాగ సన్యాసి శంకర్‌ భారతి తెలిపారు. మత స్వచ్ఛతను కాపాడేందుకే ఈ మార్గదర్శకాన్ని అమలు చేశామని చెప్పారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖారాస్‌లోని అన్ని ప్రవేశాల వద్ద పోలీసులను మోహరింప జేస్తామని..

తాము చేసిన మార్గదర్శకాలను పాటించేలా చూస్తామని నాగ సన్యాసులు చెప్పారు. ఎవరైనా దోషులుగా తేలితే శిక్ష అనుభవించాల్సిందే నని చెప్పారు. అఖారాకు చెందిన మహిళా సన్యాసి దివ్య గిరి ఈ మార్గదర్శకానికి మద్దతు ఇస్తూ మహిళా సన్యాసుల అఖారాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. అఖారా వెలుపల ఒక మహిళా సాధువును ఉంచుతామని వారు వారి నుదిటిపై తిలకం పెట్టుకున్న తర్వాత మాత్రమే లోపలికి అనుమతించనున్నామని చెప్పారు. భారతీయ సంస్కృతి త్రివేణీ సంగం పవిత్రతను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు నాగ సన్యాసులు స్పష్టం చేశారు. నాగ సన్యాసిలు తమ అఖారాలు దీనితో సంబంధం ఉన్న సాధువులు మొత్తం జాతర ప్రాంతాన్ని గమనిస్తారని చెప్పారు.
 -మహేందర్‌ మిట్టపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page