ముగిసిన మహోజ్వల ఘట్టం

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన  మహా కుంభమేలా!

144 ఏళ్లకోమారు వొచ్చే మహాకుంభ మేలా మహా శివరాత్రి పర్వదినంతో ముగిసింది. పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు సాగిన  ఈ కుంభమేలాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివొచ్చారు. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర  త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.  భారతదేశంలో మహోజ్వల ఘట్టంలో  ఇప్పటికే 68 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. పవిత్ర స్నానాలు ఆచరించిన వారి సంఖ్యను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ జనాభా భారత జనాభాకు సగంగా ఉండడం విశేషం. దేశవిదేశాల నుంచి కూడా కోట్లాది సంఖ్యలో భక్తులు వొచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, సిఎం యోగి ఆదిత్యనాథ్‌, ఎపి మంత్రులు పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌  దంపతులు ఇలా ఒక్కరేమిటి ఎందరో విఐపిలు పుణ్యస్నానాలు ఆచరించారు. స్వల్ప ఘటనలు మినహా ఓ రకంగా కుంభమేలా  అద్భుతంగా సాగిందనే చెప్పాలి.  రెండుమూడు చిన్నచిన్న స్వల్ప ఘటనలు.  మినహా అంతా ప్రశాంతంగా ముగిసింది.

ఇందుకు యూపి ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.. దాదాపు రెండేళ్ల ముందు నుంచే ఈ మహాఘట్టం కోసం ఏర్పాట్లు మొదలయ్యాయంటే .. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నారో అర్థం చేసుకోవొచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేలా. శివరాత్రి పర్వదిన స్నానాలతో ఈ మహాకుంభమేలా  ముగిసింది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్లారు. చివరి అమృత్‌ స్నానం కోసం కోటి మందికిపైగా భక్తులు వొచ్చారని  యూపీ సర్కార్‌ చెబుతోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించింది. భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టం చేశారు. భక్తుల స్నానాలకు ఇబ్బందులు లేకుండా తొక్కిసలాటకు అవకాశం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి కుంభమేలా ప్రాంతాన్ని ’నో వెహికల్‌ జోన్‌’ గా అధికారులు ప్రకటించారు. ప్రయాగ్‌రాజ్‌ మొత్తం ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడిరచారు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించారు.

యాత్రికులంతా ఈ మార్గదర్శకాలను పాటించాలని, అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. చివరి రోజు అమృత స్నానాల కోసం కోటి మందికిపైగా భక్తులు వొచ్చారని అధికారులుచెబుతున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేలా  ప్రాంతంలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లక్నో, ప్రతాప్‌గఢ్‌ వైపు నుంచి వొచ్చే యాత్రికుల కోసం ఫాఫామౌ ఘాట్‌ను నియమించారు. రేవాన్‌, బండా, చిత్రకూట్‌, విరీర్జాపూర్‌ వైపు నుంచి వచ్చే వారికోసం ఆరైల్‌ ఘాట్‌ను రిజర్వ్‌ చేశారు. కౌశాంబి నుంచి వొచ్చే భక్తుల కోసం సంగం ఘాట్‌ను కేటాయించారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే.. 40 పోలీసు బృందాలు మోటార్‌ బ్కెక్‌లపై ఆయా మార్గాల్లో మోహరించారు. ప్రయాగ్‌రాజ్‌ను కలిపే ఏడు ప్రధాన రహదారుల్లో అదనపు డ్కెరెక్టర్‌ జనరల్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారులు విధుల్లో ఉన్నారు. కుంభమేలా  ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 64 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్‌ ప్రకటించింది. చివరి రోజు భారీగా భక్తులు తరలివచ్చారు.

15000 మంది కార్మికులతో క్లీన్‌ డ్రైవ్‌..
గిన్నిస్‌ రికార్డు లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు  కుంభమేలా ప్రాంతంలో క్లీన్‌ డ్క్రెవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 15,000 మంది పారిశుధ్య కార్మికులు ఇక్కడ నాలుగు జోన్లలో క్లీన్‌ డ్క్రెవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా చీపురుపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు, ప్రయాగ్‌రాజ్‌ మేయర్‌ గణేశ్‌ కేసర్వాని, మహాకుంభ్‌ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. ఈ రికార్డుకు సంబంధించిన వివరాలను మూడు రోజుల్లో వెల్లడిరచనున్నట్లు గిన్నిస్‌ రికార్డు ప్రతినిధులు తెలిపారు.  2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేలాలో 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్‌ చేశారు.  పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేలా .. ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివచ్చారు. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేలా  ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 63 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమ స్నానం ఆచరించారు. శివరాత్రి చివరి రోజుతో ఈ సంఖ్య మరింత పెరిగింది.  మొత్తంగా  ప్రపంచం దృష్టిని మహాకుంభ మేలాతో భారత్‌ ఆకర్శించింది.
` ఎం.వర్ష
(సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page