మనం పండిరచే పంటలు, పదార్థాలను తీసుకోవడం తగ్గించిన మాట అటు ఉంచితే ఫాస్ట్ ఫుడ్ పదార్థాలకు, బయట హోటల్ లు బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే పదార్థాలకు అలవాటు పడి ఎటువంటి పోషక విలువలు లేనటువంటి పదార్థాలను మనం రోజువారి జీవితంలో తింటున్నాం. మనం తినడమే గాక పిల్లలకు కూడా వాటినే అలవాటు చేస్తున్నాం. దీని ద్వారా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ వంతు కృషి చేసినప్పటికీ, పిల్లలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో ఉన్న మహిళలకు పుట్టే పిల్లలు కూడా బలహీనంగానే ఉంటున్నారు. దీనికి కారణం మహిళలకు సరైన పోషకాహారం అందకపోవడమేనని నిపుణులు భావిస్తున్నారు. పిల్లలలో పోషకాహార లోపం వారి మొత్తం అభివృద్ధి మరియు ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది.
తల్లిదండ్రులు వారిని గుర్తించడం కష్టం. లక్షణాల గురించి మనకు తెలియకపోతే పిల్లలకు పోషకాహార లోపాలు ఉన్నాయో లేదో నిర్ధారించడం సులభం కాదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ మరియు నిర్లక్ష్యం చేయబడిన వైద్య సమస్యలలో ఇది ఒకటి.శరీరంలో తగినంత అవసరమైన ఖనిజాలు, విటమిన్లు మరియు ఇతర సేంద్రీయ మూలకాల కారణంగా ఇటువంటి వ్యాధులు సంభవిస్తాయి. బలహీనమైన ఆహారం లేదా తక్కువ పోషకాహారం తీసుకోవడం గుండె సమస్యలకు దారి తీస్తుంది. పోషకాలు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంలో సహాయపడతాయి.పోషకాహార లోపం మరియు లోపం ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి తప్పనిసరిగా ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్య సంరక్షణను మెరుగు పరచటం, పోషకాహార విద్య, పునరుత్పత్తి, వయసులోని మహిళలు, కౌమార బాలికల పౌష్ఠికతను మెరుగుపరచేందుకు అనేక పద్ధతులను అవ్లలంబి స్తున్నారు.
పోషకాహర లోపమును నివారించేందుకు ప్రభుత్వం అన్నిస్థాయిలలో జాతీయ స్థాయి నుండి గ్రామస్థాయివరకూ వివిధ పధకాల ప్రణాళికలు మరియు అమలు దీనికి అవసరం. ఆరోగ్య సంరక్షణను మెరుగు పరచటం, వ్యాధి నిరోధక శక్తిని పెంచటం కోసం మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను అందించాలి.ప్రాధమిక దశలోనే సాధారణ వ్యాధుల నిర్ధారణ మరియు సక్రమ చికిత్స వంటివి చేయడం ఒక మంచి ఆరోగ్య పరిరక్షణా విధానం సమాజములో ఉండాలి. పోషకాహార లోపాన్ని ప్రాధమిక దశలోనే గుర్తించటం, చికిత్స అందివ్వటం కూడా చాలా ముఖ్యం. పోషకాహార లోపాన్ని ప్రాధమిక దశలోనే గుర్తించటం, చికిత్స అందివ్వటం కూడా చాలా ముఖ్యం.సాధారణ ఆహార పధార్ధాల పోషకాహార నాణ్యత, ముఖ్యంగా స్థానికంగా లభించే తక్కువధర అహారపదార్ధాలు. పిల్లలకు తల్లి పాలివ్వటం మరియు అనుబంధ అహారాన్నివ్వటం యొక్క ప్రాముఖ్యత, తీసుకునే మొత్తము ఆహారపు మాంసకృత్తుల విలువను పెంచేందుకు గాను సరిjైున పరిమాణాల్లో పాలు,గుడ్లు, మాంసము మరియు ధాన్యాలను కలపాల్సిన అవసరము ఉంటుంది. జబ్బు పడ్డప్పుడు పిల్లలకు, పెద్దలకు ఆహరాన్ని ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను తెలుసుకోవాలి.
పిల్లలకు వ్యాధి నిరోధకశక్తిని పెంచడం, దైనందిన జీవితములో సక్రమమైన పారిశుధ్యాన్ని పాటించే ప్రాముఖ్యత,పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వివిధ అహార పదార్ధాల ద్వారా క్యాలరీలు,మాంసకృత్తులు మరియు సూక్ష్మ పోషకాలైన ఐరన్, విటమిన్ ఎ, మరియు జింకు మొదలైన వంటి వాటిని తీసుకోవటం ద్వారాలోటు భర్తీ చెయ్యవచ్చు. తద్వారా గర్భిణీ స్త్రీలు, శిశువులు మరియు చిన్నపిల్లలను పోషకాహార లోపానికి గురయ్యే ప్రమాదం నుంచి కాపాడవచ్చు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమము పిల్లల సంక్షేమ కోసం కొన్ని పథకాల ద్వారా గర్భస్థ స్త్రీలలో అప్పుడే పుట్టిన పిల్లలనుండి మొదలుకొని ఐదు సంవత్సరాల లోపు వారికి అన్ని రకాల పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను అందించడం జరుగుతుంది. మహిళలకు, పిల్లలకు ప్రతిరోజు పాలు,గుడ్ల తోపాటు మరిన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. అయినప్పటికీని అక్కడక్కడ పోషకాహార లోపాలు మనకు కనిపిస్తున్నాయి.వాటిని అధిగమించడానికి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు మన ఇంటి వద్ద అనేక పోషక విలువలతో కూడినటువంటి పదార్థాలను తీసుకోవాలి.
-ఎమ్.