రేవంత్ రెడ్డి వ్యక్తిగత అహాన్ని పక్కన పెట్టాలి..

  • హెచ్ సీయూ భూములపై  సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి  
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్

కంచ గచ్చిబౌలి భూమిలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై స్టే’ విధిస్తూ.. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అన్నారు. 400 ఎకరాల్లో పర్యావరణంజీవవైవిధ్యతను కాపాడాలంటూ అన్ని వర్గాల ద్వారా జరుగుతున్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని.. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిఘటనాస్థలాన్ని పరిశీలించి వెంటనే నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన తీర్పులోని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈ భూముల్లో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నెలరోజుల్లో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయం.. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కినట్లుగా భావిస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు.

 కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అటవీ సంపదను నష్టపరిచే ప్రయత్నం జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక చెట్టు నరికేందుకే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో చెట్లను నరికేందుకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారాఅని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జీవవైవిధ్యత కళ్లముందు కనబడుతున్నప్పటికీ.. చెట్లను నరికివేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు గురువారం ఉదయం ఈ అటవీ సంపద విధ్వంసాన్ని సుమోటోగా తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా..

ఉదయం నుంచి చెట్ల నరికివేతను కొనసాగించడం.. దురదృష్టకరం. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఆలోచనను మార్చుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత అహాన్ని పక్కనపెట్టి.. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు. పర్యావరణాన్నిజీవవైవిధ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అరెస్టు చేసిన విద్యార్థులనుబేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page