18 ్రపశ్నలు సంధించిన కమిషన్
పలు కాగితాలు అందజేసిన కేసీఆర్
హైదరాబాద్, జూన్ 11: కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం విచారణకు హాజరయా్యరు. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ సాగింది. మొదట దైవసాక్షిగా కేసీఆర్ చేత ప్రమాణం చేయించిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. మొత్తం 18 ప్రశ్నలను అడిగారు. ఈ సందర్భంగా కమిషన్కు కేసీఆర్ పలు పతా్రలు అందించారు. రీ ఇంజనీరింగ్, కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నలు వేసింది. రీ ఇంజనీరింగ్ చేయడానికి ప్రధాన కారణాలను కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. కేబినెట్ ఆమోదంతోనే ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. స్థల మార్పు, నీటి లభ్యత, కాళేశ్వరం నిర్మాణంపై వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిందని కమిషన్కు చెప్పారు. లైఫ్ లైన్ కాళేశ్వరం పుస్తకాన్ని కమిషన్కు అందజేశారు. అందులో కాళేశ్వరం ఉద్దేశాలను వివరించారు. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని.. బ్యారేజీల్లో నీటి నిలువ అనేది ఇంజనీర్లు తీసుకునే నిర్ణయం అని, దాంతో తనకు సంబంధం లేదని కేసీఆర్ వెల్లడించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ కోసం మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అవి నీటిని ఎత్తిపోయడానికి నిర్మించినవి అని సమాధానమిచ్చారు. ప్రాజెక్ట్ లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిది అంటూ కమిషన్ మరో ప్రశ్న సంధించగా లొకేషన్ మార్పు కారణాలపై కేసీఆర్ వివరించారు. సీడబ్ల్యూసీ తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పిందని, వ్యాప్కోస్ సర్వే చేసి నివేదిక ఇచ్చిందన్నారు. టెక్నికల్ టీం నివేదిక మేరకు లోకేషన్ మార్పు జరిగిందన్నారు. విచారణ ముగిసిన తర్వాత బీఆర్కే భవన్ ముందు కార్యకర్తలకు అభివాదం చేశారు మాజీ సీఎం అనంతరం అక్కడ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.