వరంగల్ లోని కాలోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Kaloji Health University ) ఉపకులపతిగా డాక్టర్ పివి నందకుమార్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి దవాఖాన సూపరింటెండెట్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన డాక్టర్ నందకుమార్ రెడ్డిని కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు యూనివర్సిటీకి వీసీగా డాక్టర్ కరుణాకర్ రెడ్డి పనిచేశారు
కాగా నూతన వైస్ ఛాన్సెలర్ డాక్టర్ పీవీ నంద కుమార్ రెడ్డి అధికారికంగా తన కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం వర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించి యూనివర్సిటీ సిబ్బంది తో ముచ్చటించారు . నూతన వీసీ కి రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, కంట్రోలర్ అఫ్ ఎక్సమినేషన్స్ డాక్టర్ మల్లేశ్వర్ ,జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ , అడ్మిషన్ కమిటీ మెంబెర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ హేమంత్ కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ ఖాలిద్, సిబ్బంది అభినందనలు తెలిపారు.




