కల్వకుర్తి బీజేపీకి షాక్.. 

 

*బీఆర్ఎస్ లో చేరిన ముద్విన్ గ్రామ బీజేపీ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు.

*పాలమూరు గడ్డపై ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు
*ఉత్తరాది రైతులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ రైతులపై బీజేపీకి లేదు.
*గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయండి.

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలోని బీజేపీ,రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గం, ముద్విన్ గ్రామానికి చెందిన బీజేపీ కీలక నాయకులు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు. హైదరాబాద్ లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ముద్విన్ గ్రామానికి చెందిన మారగోని నర్సింహతో పాటు సీనియర్ నాయకులు గురిగల మహేష్, పట్నం శ్రీను, పట్నం నరేష్, జీల శ్రీశైలం, దొడ్లపాటి నర్సింహ, మారమూని మల్లయ్య, గంగాపురం రాకేష్ సహా సుమారు 60 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి మాజీ మంత్రి హరీష్ రావు  గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ:..కాంగ్రెస్ బీజేపీలు తోడు దొంగలు..రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని హరీష్ రావు మండిపడ్డారు.8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ తేలేకపోయారని, పక్క రాష్ట్రాలకు వేల కోట్లు ఇస్తుంటే మనకు గుండు సున్నా మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మనకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో, రాష్ట్ర హక్కులను కాపాడటంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంది. హామీలు అమలు చేయకపోగా, ప్రజలకే కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని హరీష్ రావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను.. మా బాకీ పైసలు ఎప్పుడిస్తారు అని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు కేసీఆర్ హయాంలో కళకళలాడిన కల్వకుర్తి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు.. నేడు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో వెలవెలబోతున్నాయని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి, సామాన్యుడి ఆస్తి విలువను పాతాళానికి తొక్కేశారని అన్నారు. తెలంగాణ అస్తిత్వం నిలబడాలన్నా, అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా అది కేవలం కేసీఆర్  నాయకత్వంతోనే సాధ్యం..కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచే ఏకైక నాయకుడు కేసీఆర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. జైపాల్ యాదవ్  నేతృత్వంలో కల్వకుర్తిలో మళ్ళీ గులాబీ జెండా ఎగురవేస్తాం. వొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *