కిట్స్‌ విద్యార్థులకు రూ.7లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు

వరంగల్‌, ప్రజాతంత్ర, జనవరి 10: ఈజెన్‌ కంపెనీ మూడు దశలలో నిర్వహించిన ఇంటర్వ్యూలో కిట్స్‌ వరంగల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు సంవత్సరానికి రూ.7లక్షల (ఎల్‌పీఏ) ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఎంపికయ్యారని కిట్స్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు వెల్లడిరచారు. సాంకేతిక దిగ్గజ ఎమ్‌ఎన్‌సి కంపెనీలు రాబోయే రోజులలో కిట్స్‌ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈజెన్‌ కంపెనీ మూడు దశలలో ఇంటర్వ్యులు నిర్వహించారన్నారు. ఈ విద్యా సంవత్సరంలో సివిల్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఈసిఈ, సీఎస్‌ ఎమ్‌.ఐటి, ఈఈఈ, ఈసీఐ, బీఏ బ్రాంచ్‌లు సహా 10 బ్రాంచ్‌ల నుండి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ల ద్వారా ఇప్పటివరకు 324 ప్లేస్‌మెంట్‌లు జరిగాయన్నారు. తాజాగా ఏడుగురు సీఎస్‌ఈ, సీఎస్‌ఎన్‌ విద్యార్థులు  సంవత్సరానికి రూ.7 లక్షల (ఎల్‌పిఏ) ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. రాబోయే డ్రైవ్‌లలో విద్యార్థులు తమ సీనియర్లను అనుకరిస్త్తూ నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు స్థిరమైన అభ్యాసం, తాజా సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడం ద్వారా మంచి ప్లేస్‌మెంట్‌లను పొందడానికి వీలు కలుగుతుందని కళాశాల కోశాధికారి పి.నారాయణరెడ్డి తెలిపారు. కిట్స్‌ కళాశాల యాజమాన్యం సభ్యుడు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే వి.సతీష్‌ కుమార్‌,   సిఎస్‌ఈ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ పి.నిరంజన్‌, సిఎస్‌ఎున్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ వి.శంకర్‌, డీన్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్స్‌ ప్రొఫెసర్‌ వై.పురంధర్‌, టీపీవో డాక్టర్‌ టి. చంద్రబాయి, కార్పొరేట్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ ఇ.కిరణ్‌ కుమార్‌, పృథ్వీరాజ్‌, వివిధ విభాగాల డీన్స్‌, విభాగాదిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డీపీఆర్‌ఓ డాక్టర్‌ డి. ప్రభాకరాచారి, పలువురు బోధన, బోధనేతర సిబ్బంది ఎంపికైన ఏడుగురు విద్యార్ధుల కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *