జామీను ‘‘నేనిస్తాసార్‌’’ అన్న మల్లేశం

14.‘‌జనధర్మో’ విజయతే 

మిత్రులు లేకపోతే ఎవరూ లేరన్నట్టే. భార్య లేదా భర్త అయితే మంచి మిత్రులైతే అది చాలు. ఎన్నో సార్లు ఆచార్య ఇంటిపైన ఎన్నో సార్లు రజాకార్లు దాడిచేయడం జరిగేవి. వారి మిత్రులంతా చాలా రహస్యంగా మాట్లాడుకుంటూ ఎవరికీ పైకి చెప్పకుండా పనులు చేసుకునేవారు. రక్షణ నెట్‌ ‌తయారు చేయించడానికి వ్యూహాలను రచించడం. జాగ్రత్త చెప్పడం. మరో చోటికి మార్చడం.  ఆచార్య పై రజాకార్లు దాడిచేయడం ఎన్నో సార్లు జరిగింది. ఎప్పుడూ చెప్పుకునే వారు కాదు. కుటుంబ సభ్యులకు కూడా తెలియదు.

మంచి మిత్రులుంటేచాలు ఎన్ని కష్టాలన్నా సరే…
యం యస్‌ ఆచార్య జనధర్మ అనే పత్రిక ఆవిర్భవించీ, నడిపించినదీ మిత్రులే. అంతకు ముందు ఆయన ఒక పెద్ద పత్రిక చిన్నవిలేకరి. అంటే ఆంధ్రపత్రిక అప్పడికాలంలో నెంబర్‌ ‌వన్‌ ‌పత్రిక. ముందు ఆయన ఆంధ్రపత్రిక ఏజెంట్‌. ‌కేవలం ఒక్క ఈ పత్రికకే. అదికూడా డిపాజిట్‌ ఇచ్చేందుకు డబ్బు లేదు. రాజయ్యగారు ఇచ్చిన పైసలతో ఆంధ్రపత్రిక వందో రెండు వందల పత్రికలను అమ్ముకునే వారు. తెల్లవారు జామున 3, 4 గంటలదశలో వరంగల్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌లో ఆయన దైనందిన జీవితం మొదలవుతుంది. వరంగల్లు రైల్వేస్టేషన్‌ ‌కి వచ్చే మద్రాస్‌ ఎడిషన్‌ ‌పత్రికల కట్టలు విసిరేసి వెళ్లిపోయేవాడు. అందులో విజయవాడ నుంచి చేరిన పత్రికల కట్టలను నాన్న వెతుక్కొవాలి. సైకిల్‌ ‌కు కట్టుకుని తెల్లవారుజామున ప్రతి ఇంటికి దినపత్రికను విసిరేవారు. రోజూ కొనుక్కునే వారు నెలరోజుల తరువాత డబ్బు ఇస్తారు. కొందరు ఎగవేసేవారు. చందాలు వసూలై వస్తే గిస్తే ఆ పైసలతో అయిదుగురి కుటుంబం బ్రతకాలి.

ఆంధ్రపత్రిక ఏజెన్సీకి పని చేసేవారు. ఆంధ్రపత్రికలు 1200 కాపీలు అమ్మేవారు. ఏజెంట్‌ అం‌టే ‘ఏజెంట్‌ 999’ ‌జేమ్స్ ‌బాండ్‌ అనేది కాదు. నానా తంటాలు పడి, రోజు చదువుకుని, నెల తరువాత చందా డబ్బు వసూలు చేయడం పెద్ద పని. ఎగవేసే వాళ్లు కూడా. అందులోనే తన కమినషంతో జీవితం నడపాలవలసిందే. తరువాత ఏజన్సీ తోపాటు వారపత్రిక నడపడం మొదలుపెట్టారు. 22 ఏళ్లు తరువాత దిన పత్రికగా మార్చారు. పొద్దున 9 నుంచి రాత్రి 11 గంటలదాకా, చాలాసార్లు అర్ధరాత్రి దాకా పనిచేసుకునే వారు.

కులం కాదు, మల్లేశం మంచితనం చూడండి
అంతకుముందు స్వాతంత్య్ర సమరంలో దిన దిన గండాలతో నడిపిన ఆచార్యకు చాలా పెద్ద సంపద ఉండేవాడు. ఆచార్యవలె స్వాతంత్య్రం కోసం పరితపించిన మామూలు మనిషి మల్లేశం. కొందరు సంఘ ‘మిత్రులు’ ఆచార్యగారికి తప్పుడు కేసుల్లో ఇరికించారు. కనీసం జామీను ఇవ్వడం కూడా కష్టం. అందుకోసం డబ్బు సెక్యూరిటీకి ఇవ్వడం కూడా ఎవరిస్తారు? పనికి రాని చెత్త కేసు. కాని పోలీస్టు స్టేషన్‌, ‌కోర్టులలో ఇటువంటి కేసులు నడుస్తూనే ఉంటాయి. ఆరోజులంటే ఏదో అనుకోవచ్చు. మరి ఇప్పడి 2025నాటి సంగతేమిటి? అదృష్టం ఏమంటే పాతనాటి కోర్టుల్లో కొంచం త్వరగానే తీర్పులు వచ్చేవి. కనుకనే ఆచార్య బయటపడ్డారు.  కాని జామీన్‌, ‌బెయిల్‌ ఇప్పించడం అంటే, వారికి కావలసిన డబ్బు మాత్రం ఎవ్వరిస్తారు. అంతటి మిత్రుడు మల్లేశం.

 అనేక ఎడిటర్లను దిద్దిన ఆచార్య
ఆచార్యవలె మల్లేశం గాంధేయుడు. ఖాదీ లాల్చీ వేసుకునే వాడు. ఖాదీ బనీను, మామూలు ఖాదీ పైజామ దుస్తులు వాడేవారు. మూడు నాలుగు జతలే చాలు. జనధర్మ పత్రికను ఆచార్య నడిపితే, ప్రజామిత్ర పేరుతో దివ్వెల హనుమంతరావు నడిపించేవారు. జనధర్మ ప్రారంభించిన రోజుల్లో దివ్వెల హనుమంతరావు చాలా సహాయం చేసేవారు. ప్రజామిత్ర వారం వారం రావడానికి సాయం చేసిన వారు ఆచార్య. గీత కార్మికుల జీవితం కోసం ఒక పత్రిక ఉండాలనీ. ‘‘పరిశ్రమ’’ పేరుతో మాచర్ల జగన్నాథంను కొన్ని సంవత్సరాలు బాలాజీ ప్రింటింగ్‌ ‌ప్రేస్‌ ‌లోనే ఆచార్యగారే నడిపించే వారు. (దాదాపు వందసార్లు నేను పరిశ్రమ పత్రికల పేజీలను ఎడిట్‌ ‌చేసి ప్రింటి చేసేవాడిని) డబ్బుల లెక్కలు ఉన్నాయో లేవో. పత్రిక వస్తే చాలు అని వారి నమ్మకం.

image.png
‘‘‌ప్రతినిధి’’ పక్ష పత్రికను 26 జనవరి 1969న
 ప్రారంభించిన వ్యవస్థాపక సంపాదకుడాయన, 
వారి కుమారుడు, వరంగల్‌ ‌జైల్‌ ‌వారితోపనిచేసి రిటైర్‌ అయిన 
సాంబయ్యగారు ఇచ్చిన ఫోటో)
ప్రతినిధి పక్షపత్రిక సంపాదకుడు మల్లేశం
అంతేకాదు, జనధర్మ నిర్మాణంలో ముఖ్యమైన కార్యశీలురు మల్లేశం, వారితోపాటు పాత్రికేయులై సమానంగా నిలబడ్డారు. ‘‘ప్రతినిధి’’ పేరుతో పక్షపత్రికను నిర్వహించారు. దానికి స్పూర్థి ఆచార్య. ఎడిటర్లను తయారు చేసిన ఎడిటర్‌ ఆచార్య. దొంగ ఇరికించే నుంచి ఆచార్యను విడిపించిన మల్లేశం జామీను దొరకకపోతే ‘‘సార్‌ ‌నేనిస్తాసార్‌’’,  అన్నాడు. ఎట్లనో ఏదో జేస్తం, మిమ్మల్ని జైల్లో ఉండనిస్తమా అని మల్లేశం అంటూ ఉంటే ఈ ఆప్యాయత గురించి ఏమవి వర్ణించడం సాధ్యం? అప్పుడాయన ప్రతినిధి పత్రిక సంపాదకీయుడు కాదు. చాలా కష్టమైన రోజుల్లో ఆచార్య జనధర్మ ప్రారంభానికి ముందు, జర్నలిజం మొదలు పెట్టకుముందు మల్లేశంగారు జామీన్‌ ‌పైసలు ఇవ్వకపోతే ఎంత కష్టమో ఊహించలేరు.
ఆ రోజుల్లో మంగలి షాపులు ఉండేవి కాదు. పెట్టుబడలు కష్టం. కాని చిన్నడబ్బా పెట్టెతో తిరిగి మిత్రులందరికీ కటింగ్‌ ‌చేయించడం ద్వారా చిన్న చిన్న పైసలతో పొదుపు చేసుకుని దాచుకున్న రూపాయలతో జామీన్‌ ‌కోసం డబ్బు ఇచ్చిన వాడు మల్లేశం. ఆయన బాకీ ఏ విధంగా తీర్చగలుగుతారు? గుర్తింపు కోసం నాయీ బ్రాహ్మలు అంటున్నాంగాని, ఆయన వ్యక్తిత్వం తెలిసిన వారు ప్రేమతో పిలుచుకునే పదం ‘‘మల్లేశం’’. మల్లేశం అనే మంచి మాట విన్న తరువాత, ఇక కులం సంగతెందుకు. ఉత్తముడు అంటే చాలదా.
మల్లేశం స్వయంగా బాలాజీ ప్రింటింగ్‌ ‌ప్రెస్‌ ‌కోసం ఏ పనీ లేకపోయినా ఊరికే వచ్చి ఆచార్యను చూడడానికి వచ్చినం అనే వాడు. కాసేపు మాట్లాడిన తరువాత ‘‘ఇగో పని రాసుకోనాలె. ప్రింటింగ్‌ ‌మొదలు కావాలి. మళ్లోసారి కలుస్త’’ అనేవాడు ఆచార్య. ‘‘సరె సరే’’ అని ప్రెస్‌ ‌నుంచి బయటకు వచ్చి, పక్క సన్నటి సందులో (మూడు గదుల ఇంటికి వచ్చి, ‘‘చిన్నయ్యగారూ ఆదివారం రానా’’ అని అడిగితే అమ్మగారు (మా అమ్మ) ‘‘తప్పకుండా రా నాయనా. ఆ జుట్టుచూడు ఎంతుందో’’. నాకు రింగుజుట్టంతాతీసేస్తారు. వద్దన్నా వినరు అని నేనంటే కొంచేమే తీసేస్తలే అంటూ మల్లేశం, అయిష్టంగానే ఒప్పుకునే వాడిని. వారికి పైసలు ఇచ్చినారో లేదో తెలియదు. మాకు తెలియకపోయినాచ ఎప్పుడో నాన్న ఇచ్చిఉన్నాడనే అనుకుంటాను. ఎందుకంటే ఉత్తగా పని చేయకుండా ఉండడు.
image.png
(‌సాంబయ్య దంపతులు)
  లేకపోతే ఏ విధంగా జీవితం నడుస్తుందో ఆచార్యకు తెలియదా?
ఈ సందర్భంలో మేము హైదరాబాద్‌ ‌లో తాత అమ్మమ్మ ఇంటికి కేశవగిరికి వెళ్తే అక్కడ నల్లాన్‌ ‌చక్రవర్తి పాక్కోవుల జగన్నాధచార్యగారు టీచర్‌ ‌గా కొండకింద పనిచేసేవారు. గుడిపైన పూజారిగా పనిచేసావారు. ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన నాయీబ్రాహ్మ జాతికి చెందినవాడు. ఇది కూడా కులం అని చెప్పడానికి కాదు. దేవుడిముందు సన్నాయీ డోలు వాయించడానికి కొన్ని సంవత్సరాలపాటు ఉండేవారు. గుడినుంచి దిగుతూ ఉంటే ప్రధాన దర్వాజ్‌ ‌నుంచానికి ముందే ఒక చిన్న తలుపు ఉంటుంది. తల వంచుకుని లోపలకి వెళ్లితే అక్కడ ఒక గుహ ఉంది. అక్కడ ఎట్లా ఉండేవాడో కాని, అక్కడ రోజు ఉండేవాడు.
జపాలు చేసుకుంటూ చెన్నకేశవస్వామి కి మౌనంగా తపస్సువలె చేసేవాడు. కిష్టయ్యా అని పెద్దమ్మ పిలవడం అవసరం లేదు. ఎందుకంటే కిష్టయ్య ఎప్పుడూ జగన్నాధాచార్య దగ్గరే ఉండేవాడు. నాకు తెలిసి జగన్నాధాచార్య తరువాత కిష్టయ్యన్ను మించి భక్తుడు లేడు. అది సరే చంద్రాయణ గుట్ట రాగానే జుట్టు బాగా పెరిగిందిరా అని కటింగ్‌ ‌చేయడానికి నవ్వుతూ చేసేవాడు కిష్టయ్య. కిష్టయ్య హటాత్తుగా పోవడం నాకు చాలా బాధ కలిగింది. ఇంత పెద్దలు ఏం చేయగలం అనిపిస్తుంది. కిష్టయ్యకు పిల్లలు లేరు. భార్యలేదు. ఒంటరిగా ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ కనపడే కిష్ఠయ్య ఉన్నాడా లేనట్టా అన్నట్టు ఉంటూనే పోయాడు. వారి మేనల్లుడు రామకృష్ణ చంద్రాయణ గుట్ట కింద మంచి షాపులో నిర్మించాడు. మామ దగ్గర నుంచి ప్రేమ అభిమానం నేర్చుకున్నాడు.
మల్లేశం ఫోటో దొరికింది
మల్లేశం ఫోటో ఉంటే బాగుండు. ఎక్కడ దొరుకుతుంది. 1984 తరువాత మల్లేశం గారిని చూసూ అవకాశమే లేదు. 31 ఏళ్లకిందట నాన్నగారు పరమపదించిన తరువాత ఇంక మల్లేశం ఎక్కడ దొరుకుతాడు? విచిత్రమేమంటే దొరికినాడు. మల్లేశం కొడుకు, ఆయన పేరు సాంబయ్య. వరంగల్లు సెంట్రల్‌ ‌జైల్‌ ‌లో పనిచేసి రిటైర్‌ అయి హైదరాబాద్‌ ‌లో మా బావగారి ఇంటి ఎదురుగా ఉన్నాడనీ తెలిసింది. ఫోటో దొరికింది. మల్లేశం ఫోటో చూస్తే, ఆచార్య జీవం, స్నేహం, అభిమానం, ఇప్పుడూ నవ్వుతూ అయ్యగారు బాగున్నరంటే ఎంత బాగుంటుందో కదా అనుకున్నవాడు మల్లేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *