ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని కోరిన పిటిషనర్లను ఉద్దేశించి దేశ రక్షణ దళాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి అభ్యర్థనలూ చేయవొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలు, ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ..పిల్ మే 2న విచారించేటప్పుడు వెలువడ్డాయి. ఈ పిటిషన్‌లో పహల్గామ్ ఉగ్రదాడిని దర్యాప్తు చేయడానికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న అభ్యర్థన కూడా ఉంది. “ఇది ఆ అభ్యర్థనలకు తగిన సమయం కాదు.
దేశంలోని ప్రతి పౌరుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఐక్యంగా ముందుకొచ్చిన ఈ కీలక సమయంలో, మన సైన్యాన్ని ధైర్యం కోల్పోయేలా చేసే అభ్యర్థనలు చేయకండి. ,” అని ధర్మాసనానికి అధ్యక్షత వహించిన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. ధర్మాసనంలో న్యాయమూర్తి ఎన్. కె. సింగ్ కూడా భాగస్వామిగా ఉన్నారు. తదనంతర పరిణామాలు అన్నీ మన ముందున్నాయి.దేశ వాయు సేన కశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న ఉగ్ర వాదుల శిబిరాల పై మెరుపు దాడి చేసి నేలమట్టం చేసాయి. ఉగ్రవాద స్థావరాలపై భారత వాయు సేన దాడులు చేసే ముందు పాకిస్థాన్ దృష్టికి తెచ్చామని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ బహిరంగంగా ప్రకటించడం పలు వివాదాలకు దారి తీసింది.
ఒక వైపు దేశ ప్రధాని పాకిస్థాన్ దేశాన్ని ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా పేర్కొంటూ ..దేశం లో జరిగిన ప్రతి ఉగ్రదాడి కి కారణం పాకిస్థాన్ అని బహిరంగంగా ప్రకటిస్తూ ..మరో వైపు కేంద్ర విదేశాంగ మంత్రి ఉగ్ర స్థావరాలపై వాయు సేన దాడుల సమాచారాన్ని ముందుగా పాకిస్థాన్ కు తెలియజేయడమంటే దేశ రక్షణ దళాల ఆత్మా స్థైర్యాన్ని దెబ్బ తీసే కుట్రగానే భావించాలి. అదే సమయంలో అదే సమాచారాన్ని ముందస్తుగా దేశ సరిహద్దు ప్రాంతం పూంచ్ ప్రజలకు కూడా తెలియజేసి, అక్కడినుంచి తరలించి ఉంటే పాకిస్థాన్ క్షిపణి దాడుల్లో మరణించిన 16 మంది పౌరుల ప్రాణాలు కాపాడగలిగేవాళ్ళం.
డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడ్డులేకుండా, విచ్చలవిడిగా విశృంఖల విహారం చేస్తూ అరాజకం సృష్టించగలుగుతున్నారని ఎవరు అమానుష హింసాకాండతో అమాయకుల ప్రాణాలను హరించగలుగుతున్నారు? ఎవరు అంతులేని విధ్వంసకాండలో ఆస్తిపాస్తులను ధ్వంసం చేయగలుగుతున్నారు? ఎవరు ప్రభుత్వాల కండ్లు గప్పి తప్పించుకోగలుగుతున్నారు? ఎవరు న్యాయ స్థానాలలో ఉరిశిక్షలు పడినా అవి అమలు కాకుండా అడ్డుకోగలుగుతున్నారు? ఈ ప్రశ్నలన్నిటికి విజ్ఞులు ఎవరయినా ఇచ్చే సమాధానం ఒక్కటే – ఇవన్నీ చేయగలుగుతున్నది ఒక మతానికి చెందిన కరడుగట్టిన ఇస్లామిక్ ఛాందస వాదులు, మతోన్మాదులయిన టెర్రరిస్టులు. ఇస్లామిక్ రిపబ్లిక్ పాకిస్తాన్ ఈ మతోన్మాద దుష్టశక్తుల కేంద్రమని మొత్తం ప్రపంచానికి తెలుసు. తాలిబాన్లు, ఆల్ ఖాయిదా , లష్కరేతొయిబా, జైషే మొహమ్మద్ తదితర మతోన్మాద ముఠాల ముష్కరులు పాకిస్తాన్ ను అడ్డా చేసుకుని వివిధ దేశాలలో, ముఖ్యంగా పొరుగున ఉన్న భారత దేశంలో టెర్రరిస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికి (సైనిక నియంతల రాజ్యం నడచినా, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పరిపాలించినా) ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇస్లామిక్ మతతత్వ టెర్రరిజంకు అన్ని విధాల సహాయపడుతున్నారు. జనరల్స్ అయూబ్ ఖాన్ , యాహ్యా ఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషరఫ్ మతోన్మాదాన్ని (విశేషించి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రోత్సహించారు)- మహమ్మద్ అలీ జిన్నా, లియాకత్ అలీ, ఇష్కందర్ మిర్జా, జఫ్రుల్లా ఖాన్ , జుల్ఫికర్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ తదితరసివిలియన్ నాయకులు గూడ ఇస్లామిక్ మతోన్మాదులను ఉసికొల్పారు. ఇక ముందు గూడ ఉసికొల్పుతారు. పాక్ మిలటరీ, సివిల్ పాలకులందరి ఏకైక విధానం, ఎజెండా భారత దేశం పట్ల విద్వేషాన్ని ప్రకటిస్తూ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మతోన్మాద టెర్రరిజంతో విధ్వంసాన్ని సృష్టించడం. దశాబ్దాల కాలంగా పాకిస్థాన్ పాలకుల కుటిల చరిత్ర తెలిసి కూడా విదేశాంగ మంత్రి పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో భారత వైమానిక దళాల దాడుల సమాచారాన్ని పాకిస్థాన్ పాలకులకు తెలియజేయడం రక్షణ దళాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయడమే ..!
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర మూకల కదలికలు పెహల్గామ్ నుంచి మధ్య భారతం గుండా ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం వరకు విస్తరించాయి . భారత నిగాహ్ వర్గాలు ఉత్తర భారతదేశంలోని హర్యానాకు చెందిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ నిగాహ్ వర్గాల కోసం పనిచేస్తున్నట్లు అనుమానించి అరెస్ట్ చేశారు. మల్హోత్రా పాకిస్తాన్ గూఢచార సంస్ధలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు, ఒక పాకిస్తానీ పౌరుడితో నిరంతర పరిచయాల్లో ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ,విజయ నగరాలలో భారీ బాంబు పేలుళ్లకు కుట్ర పన్ని, రంప చోడవరం అడవుల్లో రిహార్సల్స్ చేసిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ , హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.
ఈ ఉగ్ర వాదుల కుట్రలు పహల్గామ్ దుర్ఘటన తరువాత బహిర్గత మైనా పేలుళ్లకు అంతకు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ..వారి కుట్రలను మన నిగాహ్ వర్గాలు విచ్చిన్నం చేస్తున్నాయి ..అప్రమత్తంగా ఉంటున్నాయి ..కానీ 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా నల్లధనం, అవినీతి, ఉగ్రవాదానికి నిధుల సరఫరా తగ్గించడమే లక్ష్యం అని చెప్పారు.అయితే డీమానిటైజేషన్ తర్వాత కూడా దేశంలో పలు ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) తరువాత గత 9 సంవత్సరాలుగా జరిగిన 10 ఉద్రదాడుల్లో సైనికులు, సామాన్య పౌరులు బలయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇస్లామిక్ మతోన్మాద టెర్రరిజం ప్రమాదాన్ని అలక్ష్యం చేసినట్లతే ఈ దేశం అంతర్గత భద్రతకు, స్వాతంత్య్రానికి , సార్వభౌమాధికారానికి, ప్రజాస్వామ్యానికి ముప్పుతప్పదు.