కేసీఆర్‌ ‌వచ్చినా.. కేటీఆర్‌ ‌పాదయాత్ర చేసినా ఏం లాభం?

– బీఆర్‌ఎస్‌కు కాలం చెల్లిందన్న ఆది శ్రీనివాస్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌కేసీఆర్‌ ‌బయటకు వొచ్చినా, కేటీఆర్‌ ‌పాదయత్ర చేసినా ఉపయోగమేమిటని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌ ఒక ప్ర‌క‌ట‌న‌లో విమర్శించారు. కేసీఆర్‌ ‌పదేండ్లలో చేయనిది సీఎం రేవంత్‌ ‌రెడ్డి రెండేళ్లలో చేశారని, పాదయాత్ర చేస్తే కేటీఆర్‌కు ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అగ్రనేతలు కేసీఆర్‌, ‌కేటీఆర్‌పై శ్రీనివాస్‌ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ ‌బీ ఫారం ఇచ్చినా కంటోన్మెంట్‌, ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారంటూ సందేహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ‌తొలిసారి 171 వోట్ల మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారని, కానీ తాను మొదటిసారి 14,561 వోట్లతో విజయం సాధించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తండ్రి చాటు బిడ్డగా కేటీఆర్‌ ‌రాజకీయాల్లోకి వచ్చారని వ్యంగ్యంగా అన్నారు. తాను కష్టపడి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అయితే కేసీఆర్‌ ‌మనవడు అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారని, కానీ రేవంత్‌ ‌మనవడు ప్రైవేటు ‌కార్యక్రమానికి వొచ్చారని ప్రభుత్వ విప్‌ వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page