అపార్ట్‌మెంటులో అగ్నిప్రమాదం

– జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి

జనగామ, ప్రజాతంత్ర, జనవరి 1: ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు  అక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల‌ అనేకం చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే తాజాగా మరో స్టూడెంట్‌ ‌మృతి చెందారు. కొత్త ఏడాది రోజున జర్మనీ లో ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూర్‌ ‌మండలం మల్కాపూర్‌కు చెందిన తోకల హృతిక్‌ ‌రెడ్డిగా గుర్తించారు. అతను ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లినట్లు తెలిసింది. హృతిక్‌ ‌నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో.. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. హృతిక్‌ ‌రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page