దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన్మోహన్‌కు శాసనభ ఘన నివాళి
భారతరత్న ఇవ్వాలంటూ ప్రత్యేక తీర్మానం
మన్మోహన్ దేశ గతిని మార్చిన నేత అని మంత్రుల కితాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన సేవలను కొనియాడుతూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. మన్మోహన్ ఆర్థిక సంస్కర ణల రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసన సభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారని చెప్పారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి సేవలందించారని పేర్కొన్నారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని సీఎం వివరించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమమైందని అన్నారు. 2014లో ఆంధప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడిరది. మన్మోహన్ సింగ్ ఎల్‌పీజీ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపారు. 2004-14 మధ్య ప్రధానిగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధిహా, ఆర్టీఐ, ఎన్‌హెచ్‌ఆర్‌ఎంను ప్రారంభించారు.
ఆర్థిక స్థితిగతులు మార్చే నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని సిఎం రేవంత్ అన్నారు. సామాజిక విప్లవ కార్యక్రమమైన ఆధార్‌ను మన్మోహన్ ప్రారంభించారు. సరళీకృత ఆర్థిక విధానాలు తెచ్చి ప్రపంచంతో పోటీపడేలా పునాది వేశారు. ఆయన సేవలు భావితరాలు గుర్తుంచుకోవాలి. ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తోంది. ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. ఆయన నీతి, నిజాయతీ, నిబద్ధత కలిగిన నేత. జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ప్రధాని సహా అనేక హోదాల్లో ఉన్నా నిరాడంబరంగా జీవించారు. ఉపాధిహా పథకాన్ని అనంతపురం, మహబూబ్‌నగర్ నుంచి ప్రారంభించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. 2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలకు న్యాయం జరిగేలా చేశారు. 2006లో అటవీ హక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారు. ఐటీ రంగంలో శాసించగలుగు తున్నామంటే మన్మోహన్ విధానాలే కారణం. ఆయన తెలంగాణకు ఆత్మబంధువు. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు. తెలంగాణ బిల్లులను 2 సభల్లో పాస్ చేయించిన సారథి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేస్తాం’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
దేశాన్ని బలమైన శక్తిగా నిలిపారు. : భట్టి విక్రమార్క
మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని బలమైన శక్తిగా నిలిపారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు, సామాజిక పరిస్థితి అర్థం చేసుకుని చట్టాల ద్వారా ప్రజల్లో ధైర్యం నింపారన్నారు. మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారని చెప్పారు. పాలనాపరమైన అంశాలను సామాన్యుడూ తెలుసుకునేలా 2005లో ఆర్టీఐ తెచ్చారని గుర్తుచేశారు. ఆయన తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసిందని పేర్కొన్నారు. మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని భట్టి విక్రమార్క చెప్పారు.
మన్మోహన్ సింగ్ హయాంలోనే విప్లవాత్మక భూసేకరణ చట్టం వొచ్చిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. దేశ క్షేమం దృష్ట్యా మన్మోహన్ సింగ్ న్యూక్లియర్ ఒప్పందం కుదుర్చు కున్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్. సోనియా గాంధీ సూచనల మేరకు ఆయన గొప్ప చట్టాలు తెచ్చారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే గ్రాణ ఉపాధి హా చట్టం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలని సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. ప్రజల సొమ్ముతో చేసిన పనుల వివరాలు తెలుసుకొనే హక్కు దీని ద్వారా లభించింది. ఆకలి చావులు ఉండకూడదని ఆహార భద్రత చట్టం తెచ్చారు‘ అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.
దేశాభివృద్ధికి మన్మోహన్ సింగ్ అనేక గొప్ప విధానాలు తీసుకొచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారని కొనియాడారు. మన్మోహన్‌ను ఆర్థికమంత్రిగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఎంపిక చేశారని గుర్తు చేశారు. గ్రాణ పేదలకు పని కల్పించే ఉపాధి హా పథకాన్ని మన్మోహన్ తెచ్చారని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ పటిష్ఠంగా ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. సామాన్య ప్రజలకు ఆయుధమైన ‘ఆర్టీఐ’, ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ‘ఆధార్’ తెచ్చారన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో రాష్ట్రాల్లో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారని వివరించారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని శ్రీధర్‌బాబు చెప్పారు.