సైనిక పాటవాలనికి ఒక భారతీయుడిగా గర్విస్తున్నా.. : కేసీఆర్

‘‘ భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా  గర్వపడుతున్నానని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు (KCR) తెలిపారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో వున్నా… ఏ దేశంలో వున్నా..ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదని పేర్కొన్నారు.. ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని స్పష్టం చేశారు.

భారత ఆర్మీ బుధవారం అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)  పేరిట పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై  వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ సైనిక చర్యపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ విషయంలో పాజిటివ్ గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయి. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *