రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హ‌బ్ గా తీర్చిదిద్దుతాం..

యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు..
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్స్ కప్-2024 క్రీడాపోటీల ప్రారంభం

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామ‌ని ముఖ్య‌మంత్రి  అన్నారు. 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్ , ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి హైదరాబాద్  క్రీడలకు తలమానికంగా నిలబడిందని,  తెలంగాణ వొచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు వెళ్లకుండా వ్యసనాలకు బానిసలవుతున్నారని,  హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదిక గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామ‌ని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్స్ కప్-2024 క్రీడాపోటీల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు.

నిఖత్ జరీన్ మారుమూల ప్రాంతం నుంచి వొచ్చి ఇండియాకు బాక్సింగ్ లో తలమానికంగా నిలిచార‌ని, నిఖత్ జరీన్ కు డీఎస్సీ ఉద్యోగం ఇచ్చి గౌర‌వించిన‌ట్లు తెలిపారు. తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనమ‌ని చెప్పారు. నిబంధనలు సడలించి  మహ్మద్   సిరాజ్ కు డీఎస్సీ ఉద్యోగం ఇచ్చాం.. పీవీ సింధు, అజారుద్దీన్ వంటి హైదరాబాదీలు దేశానికే పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు.. ఫుట్ బాల్ కోచ్ రహీమ్ సార్ హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావడం గర్వకారణం. హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాలని అండర్ 17 ఫుట్ బాల్ నేషనల్ టీంను తెలంగాణ దత్తత తీసుకుంటోంది..  చిన్న దేశం దక్షిణ కొరియాలో ఒలింపిక్స్ లో  36 పతకాలు సాధించింది.. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం.

యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం. దక్షిణ కొరియా కోచ్ లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇస్తాం.  మతాలకు అతీతంగా అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే. దేశ ప్రతిష్ట‌ను పెంచేది క్రీడా మైదానాలే.. ఎల్బీ స్టేడియాన్ని అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్దుతాం.. యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు.. క్రీడల్లో రాణిస్తే దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే అవకాశం ఉంటుంది.. 2028  ఒలింపిక్స్ లో దేశం తరుపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్  తీసుకురావాలి..

రాష్ట్ర క్రీడాకారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది.. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేను అత్యంత పెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా విజయం సాధించిన.. 2018 న ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేను.. 2023న తెలంగాణ కు ముఖ్యమంత్రి అయ్యాను.. తెలంగాణకు సీఎం కావాలని నేను లక్ష్యం పెట్టుకున్నా.. సాధించాను.. లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పనిచేస్తే సాధించలేనిది లేదు.. క్రీడాకారులకు పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *