దశాబ్దాల పాలన అంతం…సిరియాకు విముక్తి
మొన్న అఫ్ఘానిస్థాన్, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్ ..ఇప్పుడు సిరియా. ప్రజాపోరాటాలకు భయపడి పాలకులు పలాయనం చిత్తగించారు. దేశం విడిచి పరారయ్యారు. తాజాగా సిరియాలో దశాబ్దాల అసద్ పాలన అంతమైంది. డమాస్కస్ రెబెల్స్ హస్తగతమైంది. అధ్యక్షుడు బషర్ అల్%`%అసద్ కుటుంబంతో సహా రష్యా పారిపోయాడు. గత నెల 27 నుంచి క్రమంగా సిరియాలోని నగరాలు, గ్రామాలను ఆధీనంలోకి తెచ్చుకుంటున్న హయాత్ తహ్రీర్ అల్ షమ్ (హెచ్‌టీఎస్) నేతృత్వంలోని రెబెల్స్.. కీలకమైన అలెప్పో, హమా, హోమ్స్, అల్%`%కమల్, డెయిర్ ఎజోర్ నగరాలతోపాటు.. ఉత్తర సిరియాను ఆక్రమించిన విషయం తెలిసిందే. రాజధాని నగరాన్నిముట్టడిరచి పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబురాలు జరుపుకున్నారు. తరువాత రెబెల్స్ తమ విజయ ప్రకటన చేశారు. అసద్ పలాయనంతో.. తిరుగుబాటుదారులు సిరియా తమ వశమైందంటూ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
‘నిరంకుశ పాలకుడు అసద్ దేశాన్ని వీడాడు. సిరియాకు విముక్తి లభించింది. సిరియా ఇప్పుడే స్వేచ్ఛావాయువులను పీల్చనుంది. సిరియాలో కొత్త శకం ప్రారంభమైంది. విదేశాల్లో తలదాచుకుంటున్న సిరియన్లు ’స్వేచ్ఛాయుత సిరియా’కు తిరిగి రావాలని కోరుతున్నాం‘ అని సోషల్ విరీడియాలో పిలుపునిచ్చారు. రెబల్స్ ఒకటి రెండు రోజులలో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించే అవకాశాలున్నట్లు సిరియా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అంతర్యుద్ధంతో సిరియా దెబ్బతిన్నదని, పునర్నిర్మాణానికి చాలా సమయం పడుతుందని వివరించాయి. పశ్చిమదేశాలు, అమెరికా సాయం లేనిదే అది సాధ్యం కాదని, ఒకవేళ కొత్త సర్కారు ఇస్లామిక్ అతివాద ధోరణులను ప్రదర్శిస్తే.. ఆ దేశాలు సహకరించే అవకాశాలు అంతంతమాత్రమేనని పేర్కొన్నాయి. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలు ఒకవేళ సాయం చేసినా.. పరిమితంగానే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశాయి. తిరుగుబాటు నాయకుడు అబూ మహమ్మద్ అల్%`%గోలానీని ప్రభుత్వాధినేతగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిపాయి. మరోవైపు.. తాము ఇంతకాలం ప్రభుత్వం చెప్పినట్లు వార్తలు రాశామని, అది తమ తప్పు కాదని సిరియా పత్రికలు, వార్తాసంస్థలు రెబెల్స్‌కు సందేశాన్ని పంపాయి.
తాము ప్రజల పక్షాన ఉంటూ.. నవ సిరియా నిర్మాణానికి సహకరిస్తామని, గత సర్కారు హయాంలో వార్తలు రాసిన జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలు వొద్దని విజ్ఞప్తి చేశాయి. అసద్ పాలన అత్యంత క్రూరంగా సాగిందని చెబుతారు. సొంత ప్రజలపైనే రసాయన, సిలిండర్ దాడులు చేయించిన అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. జ్కెళ్లలో అమానుషంగా మరణ శిక్షలను విధించేవాడని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2016లోనే ఆరోపించింది. అమ్నెస్టీ తమకు 2011-15 మధ్యకాలానికి సంబంధించిన అరాచకాల వివరాలే అందాయని, ఆ తర్వాత డేటా దొరకలేదని పేర్కొంది. ఈ మధ్యకాలంలోనే అధికారికంగా లక్ష మందికి మరణ శిక్షలు విధించినట్లు పేర్కొంది. అనధికారికంగా ఈ సంఖ్య 3 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఒక్క సాయ్‌డాన్‌యా జ్కెలులోనే.. అధికారికంగా 30 వేల మంది ఖ్కెదీలు మరణశిక్షకు గురయ్యారు. ఈ దారుణాలకు మారుపేరు సాయ్‌డాన్‌యా జ్కెలు అని మాజీ ఖ్కెదీలు చెబుతుంటారు. ఇదిలావుంటే, అసద్ దేశాన్ని వీడి పారిపోయాడన్న వార్తతో.. ఆదివారం మధ్యాహ్నం ప్రజలు డమాస్కస్ వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకొన్నారు. దేవుడి కరుణతో నిరంకుశ పాలన నుంచి తమకు విముక్తి లభించిందని పేర్కొన్నారు. అదే సమయంలో.. రాజధాని నగరంలో లూటీలు కూడా జరిగాయి. అధ్యక్ష భవనంలోకి చొరబడ్డ ప్రజలు..దొరికిన వస్తువును దొరికినట్లు దోచుకున్నారు. రక్షణ శాఖ ఆఫీసులో కూడా లూటీ జరిగినట్లు వార్తలొచ్చాయి. సిరియా సెంట్రల్ బ్యాంక్‌లో కరెన్సీ కట్టలున్న డబ్బాలను కూడా పౌరులు ఎత్తుకెళ్లడం కనిపించింది. తర్వాత తిరుగుబాటు దారులు డబ్బులకు కాపలాగా ఉన్నారు. మరోవైపు, సిరియా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.
-కల్లూరి రామకృష్ణా రెడ్డి