రెవెన్యూమంత్రి పేరిట వ‌సూళ్లు.. ఇద్ద‌రు నిందితుల‌ అరెస్ట్

అధికారాన్ని దుర్వినియోగ‌ప‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు
మంత్రి పొంగులేటి హెచ్చ‌రిక‌

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25 : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti srinivas reddy ) ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ ( PA) ల మ‌ని చెప్పి అమాయ‌కుల‌ను మోస‌గిస్తున్న  ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన బుస్సా వెంక‌ట‌రెడ్డి, మ‌చ్చ సురేష్ .. హైద‌రాబాద్ నాగోల్‌లో నివాస‌ముంటున్నారు. వీరు మంత్రి  పిఎలమంటూ రెవెన్యూ అధికారులు, పోలీసుల‌కు ఫోన్లు చేసి వసూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని మంత్రి దృష్టికి వ‌చ్చిన వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన పోలీసులు అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు. ఇక నుంచి త‌న పిఎలమంటూ ఎవ‌రైనా  ఫోన్ చేస్తే, ఎలాంటి చిన్న అనుమానం క‌లిగినా స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యం 040-23451072 /  040-23451073  నెంబ‌ర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల‌ని  మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఎవ‌రైనా ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగప‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మంత్రి హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *