ఎన్ని స‌వాళ్లు ఎదురైనా ప్ర‌జ‌లతోనే ఉంటా..

  • న‌న్ను రాజ‌కీయంగా అణ‌చివేయాలని కుట్ర‌లు
  • అలాంటి వారికి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా..
  • టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12 : ఎన్ని స‌వాళ్లు, క‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ తాను నిరంత‌రం ప్ర‌జ‌ల‌తోనే ప్ర‌జ‌ల కోస‌మే ఉంటాన‌ని టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మామిండ్ల ఝాన్సీ రెడ్డి ( Hanumandla Jhansi Reddy) అన్నారు. గురువారం హ‌న్మ‌కొండ‌లో నిర్వ‌హించిన‌ మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడారు. తొర్రూరు, పాలకుర్తి ప్రాంతాలలో అనేక సేవ కార్యక్రమాలు చేశాం. 2014లోనే రాజకీయ అవకాశాలు వొచ్చినా నాకు ఆస‌క్తి లేదని చెప్పాను. ఒకసారి పాఠశాలల్లో ఆడపిల్లల కోసం చేపట్టిన కార్యక్రమంలో అక్కడి నేత తీరు ఇబ్బంది కలిగించింది. నాకు ఎంటువంటి దురుద్దేశం, రాజకీయ ఆలోచన లేకపోయినా.. ఆ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాల‌ని చూశారు. అంతేకాదు.. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కొనిచ్చిన స్థలం, గుర్తూరు ల్యాండ్, ఇలా అనేక విషయాల్లో మోకాలడ్డే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నా ఇగో హర్ట్ అయింది. సేవ చేసేందుకు వొస్తే ఇలా ఇబ్బంది పెట్టడం ఎంటనే ఆలోచన వొచ్చింది. ఇక 2023లో నాకు అనుకోకుండా పిలుపు రావడంతో రాజకీయాల‌ వైపు అడుగులు పడ్డాయని హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తెలిపారు.

అమెరికా నుంచి వొచ్చింది. ప్రజల్లో ఏం కలిసిపోతుందని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎగతాళి చేశారు. కానీ ప్రజల్లో కలిసిపోవడం నాకు ఇష్టం. ఆప్యాయతలు చూశా. తండా ప్రజల ఇండ్లలోకి వెళ్లా. వారిలో ఒకరిగా అడుగు వేశా. అందుకే మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. ప్రజలకు నాకు గ్యాప్ వొచ్చిందనేది అవాస్తవం. ఎమ్మెల్యేగా యశస్వినిరెడ్డి ఉంది.. నేను నాయకురాలిగా ఉన్నా. పనులు ఎమ్మెల్యే పరిధిలో ఉంటాయ్. కాబట్టి నా వద్దకు వొచ్చిన వారికి ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని సూచిస్తా. తనతో ఉన్న అనుబంధం వల్ల నేను పనిచేయడం లేదనే భావన ఉండొచ్చు.. కానీ ప్రజలకు నేను దూరంగా లేను. వారు నాకు దూరంగా లేరు. అందంతా కుట్రల్లో పీహెచ్ డీ చేసిన వారి అభూత కల్పన. కన్నీళ్లు పెట్టించాడు.. రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది.. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అధికార బలంతో తనను తొర్రూరు నుంచి లోకల్ కాదంటూ పంపించాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకున్నాం. చివరి రోజు చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆధిపత్యాన్ని తొక్కిపెట్టి.. భారీ మెజార్టీతో గెలిపించారు. ఫోన్ ట్యాపింగ్, పంచాయతీ రాజ్ లో నిధుల దుర్వినియోగం ఇతర అంశాల్లో తప్పకుండా శిక్షపడే అవకాశం ఉండొచ్చు. ఎర్రబెల్లి దయాకర్ రావు‌ను వదిలేది లేదు. ఇక డీలిమిటేషన్, రిజర్వేషన్ల మార్పు నేపథ్యంలో పాలకుర్తి మహిళకు అయ్యే అవకాశం ఉంది. దీన్ని గమనించి ఎర్రబెల్లి వర్ధన్నపేటపై ఫోకస్ చేస్తున్నడు. ఆయన ఎక్కడికి పోయిన ఫాలొ అవుతా. ఆయన పై పోటీ చేయాల్సి వస్తే వెనక్కి తగ్గేది లేదు. ఇక మహిళలకు రిజర్వేషన్ కోట అమల్లోకి వస్తే.. నాకు అవకాశం వస్తే ఎమ్మెల్యేగా తప్పకుండా పోటీ చేస్తానని ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *