శివ్‌రాజ్‌ పాటిల్‌ మృతి దేశానికి, కాంగ్రెస్‌కు తీరని లోటు

– సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి సీతక్క సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: నైతిక విలువలు.. హుందాతనంతో రాజకీయాలు నెరిపిన పెద్ద మనిషి శివరాజ్‌ పాటిల్‌ మృతి దేశానికి, కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి ప్రస్థానం ప్రారంభించిన పాటిల్‌ ఏడుసార్లు ఎంపీగా, లోక్‌ సభ స్పీకర్‌గా, కేంద్ర హోం శాఖ మంత్రిగా, పంజాబ్‌ గవర్నర్‌గా ఆయన సేవలందించారని సీఎం గుర్తు చేశారు.

మంత్రి సీతక్క సంతాపం

శివరాజ్‌ పాటిల్‌ మృతి పట్ల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్లలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారని గుర్తుచేశారు. దేశ పార్లమెంటరీ చరిత్రలో లోక్‌సభ స్పీకర్‌గా ఆయన పోషించిన పాత్ర అత్యంత ప్రశంసనీయమన్నారు. ఎలాంటి పదవిలో ఉన్నా అత్యున్నత నిబద్ధతతో ప్రజాసేవ చేసిన నాయకుడిని దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, ఆప్తులకు, అభిమానులకు సీతక్క ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page