Category Uncategorized

ఇం‌టి భోజనం సర్వీస్‌ ‌చేయనున్న జోమాటో

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23 : ఫుడ్‌-‌డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ ‌జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రెస్టారెంట్ల నుంచి పుడ్‌ ‌సరఫరా చేస్తున్న ఈ సంస్థ ఇక ఆఫీసులకు వెళుతున్న వారికి ఇంటి భోజనాలు అందించనుంది. ముంబైలో డబ్బావాలల పాత్రను పోషించనుంది. ఇక నుంచి ఎవరైనా తమింటి భోజనాన్ని పంపిస్తే వారికి కూడా అందించనుంది.…

అమెరికాలో మరోమారు మంచు తుఫాన్‌

న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : అగ్ర రాజ్యం అమెరికా మరోసారి మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్‌ ‌లేక్స్ ‌వరకు భారీగా మంచు తుపాను కురుస్తుండటంతో..ఏకంగా 1500 విమానాలు రద్దు అయ్యాయి. పలు నివాసాలకు విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోయింది. గంటకు 55 నుంచి 70 కిలోటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే…

తమిళ నాడు మాజీ సిఎం పన్నీరు సెల్వంకు సుప్రీమ్‌ ‌కోర్టులో షాక్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23(ఆర్‌ఎన్‌ఎ) : ‌పన్నీరు సెల్వంకు సుప్రీంలో షాక్‌ ‌తగిలింది. ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడికే పళని స్వామి కొనసాగవచ్చునని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. గతంలో మద్రాస్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో ఆ పార్టీ సీనియర్‌ ‌నేత ఓ పన్నీర్‌సెల్వంకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టులో…

దండుపాళ్యం ముఠా

‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు 2014లో చందగ్రహణం పట్టింది. బిఆర్‌ఎస్‌ ‌నాయకులు దండుపాళ్యం ముఠాలుగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ తాజాగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో పర్యటిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ‌కమిటి రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శ చేశారు. అంతేకాదు వరంగల్‌ ఈస్ట్, ‌వెస్ట్ ఎంఎల్యేలను బిల్లా, రంగాలుగా పోలుస్తూ, వారి అనుచరులు దండుపాళ్యం…

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలే..

ప్రజా వ్యతిరేక పాలన పోవాలే.. గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాపారంలో కేటీఆర్‌ ‌భాగస్వామి భూపాలపల్లి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలలో కెటిఆర్‌కు వాటా నిరూపించేందుకు మా నాయకులు సిద్ధం బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్‌కు రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ చిట్యాల(భూపాలపల్లి జిల్లా), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వేల కోట్ల…

చందన్‌వెల్లిలో అతి పెద్ద పారిశ్రామిక కేంద్రం

మైక్రోసాప్ట్, అమెజాన్‌, ‌కిటెక్స్ ‌తదితర కంపెనీల రాక ప్రాంత అభివృద్దికి ప్రత్యేక చర్యలు వెల్‌ ‌స్పన్‌ ‌టెక్స్‌టైల్‌ ‌యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం చందన్‌వెల్లిలో ఏర్పాటుకాబోతుందని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. బాలకృష్ణ గొయెంక 1985లో ఒక సంస్థను స్థాపించి..ఈ రోజు గుజరాత్‌లో 25వేల…

పోక్సో కేసులో 25 సంవత్సరాల కఠిన కారగార శిక్ష

కొత్తగూడెం జిల్లా పోక్సో స్పెషల్‌ ‌జడ్జి కీలక తీర్పు కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : పొక్సో కేసులో వ్యక్తికి 25 సంవత్సరములు కఠిన కారగారి శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్ ‌జడ్జి పోక్సో స్పెషల్‌ ‌జడ్జి ఎం. శ్యామ్‌ ‌శ్రీ  బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే…2018లో దుమ్ముగూడెం…

రౌడీల్లా ప్రవర్తిస్తున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : బీఆర్‌ఎస్‌ ‌నేతలు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారని వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల ఆరోపించారు. ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేల అవినీతి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అసలు లా అండ్‌ ఆర్డర్‌ ‌బతికే ఉందా అని షర్మిల ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ ‌నేత పవన్‌ను ఆమె…

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండోరోజు బుధవారం ధ్వజారోహణం చేపట్టారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా యజ్ఞాచార్యులు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయాణికుల మధ్య కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. వేద స్వరూపుడైన గరుత్మంతుని…