Category Uncategorized

తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్‌ ‌రైలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌తెలుగు రాష్ట్రాల మధ్యన రెండవ వందేభారత్‌ ‌రైలు పరుగుపెట్టనుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్‌ 8‌వ తేదీన సికింద్రాబాద్‌ ‌నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. వరుసగా రెండు రైళ్లను అందించినందుకు ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌-‌తిరుపతి మధ్యన ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌,…

ఆం‌దోళనకరంగా కొరోనా కేసులు

చెన్నై, ఏప్రిల్‌ 1 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్‌-19 ‌కేసుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం వెలువరించింది. అన్ని హాస్పిటళ్లలోనూ ఏప్రిల్‌ 1 ‌నుండి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. హాస్పిటళ్లలో ఇన్‌ఫెక్షన్‌, ‌క్రాస్‌-ఇన్‌ఫెక్షన్‌ ‌వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందన్న నిపుణుల హెచ్చరికతో.. అన్ని ఆసుపత్రులలోని ఇన్‌పేషెంట్‌,…

ఏపి పుట్టపర్తిలో ఉద్రిక్తత

వైసిపి, టిడిపి నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు రాళ్లు, చెప్పులు విసురుకున్న కార్యకర్తలు ధ్వంసమైన కార్లు..పలువురికి గాయాలు అనంతపురం, ఏప్రిల్‌ 1 : ఏపి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌, ‌మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ ‌రెడ్డి సవాల్‌తో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందుగా సవాల్‌…

జైలు నుంచి సిద్ధూ విడుదల

చండీఘడ్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత నవజ్యోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధూ(59)  శనివారం పాటియాలా జైలు నుంచి విడుదల అయ్యారు. జైలులో సత్పవ్రర్తన కారణంగా రెండు నెలల ముందుగానే ఆయన విడుదల అయ్యారు. పంజాబ్‌ ‌జైలు నిబంధనల ప్రకారం సత్పవ్రర్తన కలిగిన దోషి క్షమాపణకు అర్హులని  సిద్ధూ తరఫు లాయర్‌ ‌హెచ్‌పీఎస్‌ ‌తెలిపారు.…

ఏ‌ప్రిల్‌, ‌జూన్‌ల మధ్య దేశంలోని చాలా ప్రాంతాలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 01 : ‌కొన్ని ప్రాంతాలను మినహాయించి భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్‌ ‌నుండి జూన్‌ ‌వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. ఈ కాలంలో మధ్య, తూర్పు మరియు వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు…

ఏపిలో 3 నుంచి టెన్త్ ‌పరీక్షలు

అమరావతి, ఏప్రిల్‌ 1 : ఏపీలో టెన్త్ ‌క్లాస్‌ ‌పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్ ‌క్లాసు స్టూడెంట్స్ ‌కు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ కల్పిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఏపీలో ఏప్రిల్‌ 3 ‌నుంచి టెన్త్ ‌క్లాస్‌ ‌పరీక్షలు జరగనున్నాయి. 18 వరకు…

నేడు హైదరాబాద్‌ ఉప్పల్‌ ‌స్టేడియంలో తొలి ఐపిఎల్‌

సన్‌ ‌రైజర్స్ ‌హైదరాబాద్‌-‌రాజస్థాన్‌ ‌రాయల్స్ ‌మధ్య పోరు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి చౌహాన్‌ హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ఐపీఎల్‌ 16‌వ సీజన్‌ ‌లో భాగంగా హైదరాబాద్‌ ‌లోని ఉప్పల్‌ ‌స్టేడియం వేదికగా 7 మ్యచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో  ఈనెల 2వ తేదీ ఆదివారం మొదటి మ్యాచ్‌ ‌సన్‌ ‌రైజర్స్ ‌హైదరాబాద్‌-‌రాజస్థాన్‌ ‌రాయల్స్…

రవి మార్గం

చెలరేగే కోర్కెల గుర్రాల జోరులో, విషవలయాల్లోకి లాగే స్వార్ధశక్తుల పరిచయంతో కన్నపేగుని ఏమారుస్తూ, అత్యాశల మరీచికల వెంబడి ప్రయాణిస్తూ, నిరంతర చీకటిని వాటేసుకుంటోన్న ఓ యువతా! నీ మనసుకు కాస్త విచక్షణా కళ్లెం వేయి. గాయపడిన మనసు తెరపై ఏర్పడిన రుధిర మరకల్నే చూసుకుంటూ నెరవేరని సదాశల పందిరికింద చతికిలబడక నీలో చేతనత్వాన్ని కాస్తంత నిద్ర…

హస్తినకు పాండవులు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రోణాచార్యుడూ, కృపాచార్యుడూ పాండవాదులకు స్వాగతం పలికి తోడ్కొని వెళ్ళారు. ద్రౌపదిని దుర్యోధనుడి భార్య కురువంశస్త్రీలు అందరూ వచ్చి ఆహ్వానించారు. హస్తినాపుర ప్రజలు లక్షల సంఖ్యలో వచ్చి పాండవులను చూసి ఆనందభరితులయ్యారు. రోజులు గడిచిపోతున్నాయి. ఒక  రోజున ధృతరాష్ట్రుడు పాండవులను సభాభవనానికి రప్పించి, తన కొడుకులకూ వారికి విద్వేషాలు పెరగకుండా…