Category Uncategorized

ఐదు పంచాయతీలు తెలంగాణలో కలపాలి 

 తమను తెలంగాణలో కలపాలని పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలు  మంగళవారం ఐటీడీఏ రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు.పురుషోత్తపట్నం గ్రామ ప్రజలకు సీపీఐ పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్‌ ‌మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్‌ ‌మాట్లాడుతూ మొదటి నుండి ఈ పంచాయతీల ప్రజలు తెలంగాణలో కలపాలని ఉద్యమం చేస్తున్నారని వెంటనే ఏపీ,కేంద్ర ప్రభుత్వం స్పందించి…

మంత్రి హరీష్ రావు నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ

నల్లగొండ ,జూలై 26: నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మంగళ వారం  ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ను సందర్శించి వైద్యులు సిబ్బందితో మంత్రి సమీక్షించారు. వైద్యుల పనితీరు పై ఆరా తీశారు. సిబ్బంది టైం రిజిస్టర్ తనిఖీ చేశారు. అన్ అథారైజ్డ్…

మండలాల కోసం జనం ఆందోళన

కొత్త మండలాలపై పలుచోట్ల నిరసన సోనాల, మల్లంపల్లిల కోసం ధర్నాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : మండలాల ఏర్పాటుపై పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్‌ ‌జిల్లా బోధ్‌ ‌మండలం సొనాలలో రెండో రోజు గ్రామస్తులు వర్షంలోనే రాస్తారోకో చేపట్టారు. గొడుగులు పట్టుకుని బోథ్‌-‌కిన్వట్‌ అం‌తర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. సోనాలను మండలంగా…

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులకు సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు సీఎస్‌ ‌దిశానిర్దేశం చేశారు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని సీఎస్‌…

నేచుర్‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ అభివృద్ధికి కృషి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : అవి•ర్‌పేటలోని గాంధీ నేచర్‌ ‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్‌ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన గాంధీ నేచర్‌ ‌క్యూర్‌…

రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు

నగరంలో అర్థరాత్రి వర్షబీభత్సం పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..నీటమునిగిన పలు కాలనీలు జంట జలాశయాలతో పాటు హుస్సేన్‌ ‌సాగర్‌కు వరద శ్రీరాంసాగర్‌, ‌కాళేశ్వరం, సాగర్‌ ‌జలాశయాలకు వరద ప్రవాహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. పలు ప్రాజెక్టుల్లోకి మళ్లీ వరద పెరిగింది. గోదావరి పరివాహకం…

‌క్రికెట్‌ ‌స్కామ్‌ ‌కేసులో ఫరూక్‌ అబ్ధుల్లాపై చార్జిషీట్‌ ‌దాఖలు చేసిన ఇడి

శ్రీనగర్‌, ‌జూలై 26 : క్రికెట్‌ ‌స్కామ్‌ ‌కేసులో మనీల్యాండరింగ్‌ ‌నియంత్రణ చట్టం నిబంధనల కింద జమ్మూ కశ్మీర్‌ ‌మాజీ సీఎం ఫరూక్‌ అబ్ధుల్లాపై శ్రీనగర్‌ ‌కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఇడి) చార్జిషీట్‌ ‌దాఖలు చేసింది. మనీ ల్యాండరింగ్‌ ‌కేసులో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌చీఫ్‌ ‌ఫరూక్‌ అబ్ధుల్లా, అహ్మద్‌ ‌మిర్జా, ఇతరులను కోర్టు ఎదుట హాజరు కావాలని…

గుజరాత్‌లో విషాదం నింపిన  కల్తీ మద్యం

28 మంది మృత్యువాత గాంధీనగర్‌, ‌జూలై 26 : గుజరాత్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదంనింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 28 మంది చనిపోయినట్లు గుజరాత్‌ ‌డీజీపీ ఆశిష్‌ ‌భాటియా తెలిపారు. బొటాడ్‌ ‌జిల్లా, రోజిడ్‌ ‌గ్రామంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. రోజిడ్‌ ‌సహా చట్టుపక్కల గ్రామాలకు…

దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలి

ఇది జాతి ఐక్యత, సమగ్రతలను బలోపేతం చేస్తుంది ఈశాన్య ప్రాంతం పర్యాటక స్వర్గధామం ‘నార్త్ ఈస్ట్ ఆన్‌ ‌వీల్స్’ ‌యాత్రికులతో ఉపరాష్ట్రపతి హైదరాబాద్‌. ‌పిఐబి, జూలై 27 : భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ముందుగా దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో పర్యటించటం కంటే ముందు మన దేశంలో…