Category తెలంగాణ

వాజ్‌పేయి రాజ‌నీతిజ్ఞ‌త స‌దా స్మ‌ర‌ణీయం

~ గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్‌, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25ః భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101 జ‌యంతి సంద‌ర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కులోని ఆయ‌న‌ విగ్రహానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావులు పుష్పాంజలి ఘటించారు. అటల్…

రేవంత్ కు విలువలు లేవనేది స్పష్టమైంది

– బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌లు విలువ‌ల‌ను దిగ‌జారుస్తున్నాయి ~బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలువదని మాట్లాడడం, పార్టీ మారిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో ఉన్నామని చెప్పడం వారి అనైతికతకు నిదర్శనమ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు…

చిన్నారి ప్రాణం తీసిన పెన్సిల్‌

ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌తను రాసుకునే పెన్సిలే ‌విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్‌ ‌గూడెంలో బుధవారం జరిగింది. విహార్‌ (6) ‌స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం పాఠశాల విరామ సమయంలో మూత్రశాలకు వెళ్లి తిరిగి పరుగెత్తుకుంటూ తరగతి గదికి వస్తుండగా.. అదుపు…

గుజరాత్‌ ‌నుంచి తీసుకొచ్చి పిల్లల విక్రయం

– 20మంది ముఠా సభ్యులను పట్టుకున్నాం – మాదాపూర్‌ ‌డీసీపీ రితు రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్‌ ‌డీసీపీ రితు రాజ్ ‌మీడియా సమావేశంలో వెల్లడించారు. గుజరాత్‌ ‌నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్‌, ‌మంచిర్యాలలో విక్రయించారు.…

ఏఐ సాయంతో హైటెక్‌ ‌కాపీయింగ్‌

– పట్టుబడ్డ ఇద్దరు యువకులు – ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ఏఐ ‌సాయంతో నకలు కొట్టబోయి దొరికిన యువకుల వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. గతంలో నేరుగా చిట్టీలతో కాపీ కొట్టేవారు.  ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ ‌టెక్నాలజీని వాడి పరీక్షల్లో కాపీ కొట్టేద్దామనుకున్న ఇద్దరు యువకులను అధికారులు గుర్తించారు. ఈ…

నిజామాబాద్‌లో అత్యధిక సర్పంచ్‌ల గెలుపు

– రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం – కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చే జీ.ఓలు పారదర్శకం – ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి విజినరీ నేత – టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమర్‌ ‌గౌడ్‌ ‌నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌రాష్ట్రంలో అత్యధిక కాంగ్రెస్‌ ‌సర్పంచ్‌లు నిజామాబాద్‌ ‌జిల్లాలోనే గెలుపొందారని.. వొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని…

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత, కె.చంద్ర శేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన అహింసా శాంతి మార్గమని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో…

మాట నిలుపుకున్న మంత్రికి  గ్రామస్తుల సన్మానం

– ఎన్నికల హామీ నెరవేర్చిన మంత్రి శ్రీధర్ బాబు  ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలుపుకున్న ఐటీ ,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ముత్తారం మండలం పోతారం గ్రామ ప్రజల చిరకాల స్వప్నం అయిన పోతారం గ్రామ చెరువు కట్ట…

వైకుంఠ ఏకాదశికి సిఎంకు ఆహ్వానం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన యాదగిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో వైకుంఠ ఏకాదశిని పుర‌స్క‌రించుకుని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిందిగా ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డిని ఆలయ ఈఓ వెంకట్రావు, ఆలయ అర్చకులు…