నూతన సచివాలయం తన ఛాంబర్ లో ఆసీనులైన సందర్భంగా…. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతకాలు చేసిన ఫైళ్ళ వివరాలు :
1. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఫైలు మీద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి 1100 లబ్ధిదారుల చొప్పున దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలనే ఫైలుమీద సిఎం కేసీఆర్ సంతకం…
