Category తెలంగాణ

మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు

జూలై 31: రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం బైపాస్ రోడ్ లోని పాత డిఆర్డిఏ కార్యాలయంలో గల జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమాఖ్య సమావేశానికి ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్…

సమస్యల పరిష్కారానికి తపస్ ఉద్యమ బాట : రాష్ట్ర కార్యదర్శి సింగోజు జనార్ధన్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 31 : రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల జీవితాన్ని దుర్భరం చేస్తున్న సిపిఎస్ భూతాన్ని అంతం చేయడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టామని, అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపి తమ సమస్యను పరిష్కరించాల్సిన కృషి చేయాల్సిన…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్ర1జాతంత్ర జులై 31 : లింగోజిగూడా డివిజన్ నందు గతంలో మూడు కోట్ల 16 లక్షలు రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా ఈ రోజు మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు కలిసి పలు శంకుస్థాపన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.దానిలో…

ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను పరిష్కరించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముదిరాజ్ చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు శివ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బిసి సాధికారత భవన్ లో ముదిరాజులకు రాజ్యంగ బద్దంగా రావాల్సిన హక్కుల కోసం ‘ఆలోచనపరుల మేధోమధనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా శివ ముదిరాజ్…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31: మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన గుమ్మల్ల సాయి రెడ్డి కి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి అందజేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో మంజూరైన రూ.62,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి సోమవారం బాధితునికి…

ముత్యాల ధర్మశాల ను ఎండోమెంట్ నుంచి తొలగించాలనీ మంత్రికి వినతి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31:ముత్యాల ధర్మశాలను  ఎండోమెంట్ నుండి తొలగించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డిని, ఎండోమెంట్ కమిషనర్లను కలిసిన వికారాబాద్  ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ముత్యాల ధర్మశాలను ఎండోమెంట్ నుండి తొలగించాలని వినతి పత్రం…

మర్పల్లిలో రోడ్లు డివైడర్స్ సెంట్రల్ లైటింగ్ కు నిధులు మంజూరు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31:  తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. వికారాబాద్ కు నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి “96 కోట్లు” మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మర్పల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ మరియు…

సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇంటింటా ఎన్నోవేటర్ : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31: ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటింటా ఎన్నోవేటర్ అనే కూడా పత్రికను కలెక్టర్ ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే “ఇంటింటా ఇన్నోవేటర్”…

నీట మునిగిన నందన్ రతన్ ప్రైడ్ కాలనీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 31: గత మూడు సంవత్సరాలుగా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో చిన్నపాటి వర్షానికి చెరువులు పొంగి ఇల్లు అన్ని నీట మునుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సి.గోదావరి అంజిరెడ్డి ఆరోపించారు. సోమవారం గోదావరి అంజిరెడ్డి నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా…