Category ప్రత్యేక వ్యాసాలు

ఆంధ్రా ప్రయోజనాలు ముఖ్యమా.. మోదీని మోయడం ప్రధానమా?

చంద్రబాబు, పవన్‌ బాబులూ కళ్లు తెరవండి! కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన మెజార్టీ రాకపోయినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం బీజేపీని, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని భుజాల మీద మోస్తున్నారు. నేనే నిజమైన రాజును అనే వారెప్పుడూ నిజమైన రాజు కారు. మోదీ తరపున యుద్ధం చేసి ఆ యుద్ధంలో…

బాలకార్మికుల గోడు పట్టేదెవరికి?

పసిపాపలు సహజ పరిశోధకులు. ఈ పరిశోధన వికసించడం తరతరాల మానవ చరిత్ర.. యుగయుగాల మానవీయ సంస్కారం. ఈ చరిత్ర చెరగిపోతుండడం ఆధునిక నాగరిక జీవన ‘విలాసం’ ఫ్యాషన్‌! ఈ సంస్కారం సంకరమైపోతుండడం వాణిజ్య ప్రపంచీకరణ ఫలితం.  ఐరోపా వారు, అరబ్బు జాతుల వారు మానవులను బానిసలుగా అమ్మడం చరిత్ర. చిన్నపిల్లలను కర్మాగారపు గొట్టాలపైకి ఎక్కించి పనిచేయించిన…

తుంట ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్లైందా..?

కాంగ్రెస్‌, ‌బిఆర్ఎస్‌ ‌దొందూ దొందే చర్చలకు ససేమిరా అంటున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికీ నిరుద్యోగులు దూరమవుతున్నారా? గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు దూరమవుతుందా అంటే గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అదేపోబడి కనిపిస్తున్నది. గత బిఆర్ఎస్‌ ‌ప్రభుత్వం ఓటమి పాలవడానికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, నిరుద్యోగులు కూడా ఒక…

‌పదేళ్ళ ప్రశాంతతను కోల్పోయిన ఉస్మానియా

మళ్లీ పోలీసుల కవాతు, లాఠీ చార్జ్‌లు, అరెస్టులు… ప్రభుత్వ దాటవేత ధోరణిపై విద్యార్థులు, నిరుద్యోగుల మండిపాటు జర్నలిసులపై దాడిని ఖండిస్తున్న విద్యార్థి సంఘాలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 11 : తెలంగాణ అస్థిత్వం మొదలు విద్యా, నిరుద్యోగ సమస్యలపై పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధులు ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తారు.…

అమృతోత్స‌వ క‌విత్వం…

కాలం ఎంత మిడిసి ప‌డ్డా/ అక్ష‌రం ఎప్ప‌టికీ అక్ష‌ర‌మే అని త‌ర‌త‌రాల‌కు త‌ర‌గ‌ని వెలుగై విరాజిల్లే అక్ష‌ర‌ శ‌క్తి బ‌లిమిని బ‌లంగా చెప్పిన క‌వి డా.ఎన్‌. గోపి. త‌న అమృతోత్స‌వం సంద‌ర్భంగా 75 క‌విత‌ల స‌మాహారంతో రేప‌టి మైదానం అన్న సంపుటిని ఆయ‌న వెలువ‌రించారు. తొలి క‌విత రేప‌టి మైదానం జీవ‌న‌రంగ‌స్థ‌ల‌పు దృశ్యీక‌ర‌ణ‌తో సాగింది. ఈ…

ఏం ‌మార్పు వొచ్చింది..?

ప్రగతి భవన్‌ ‌గడీ బద్ధలు కొట్టడం ఆరంభ శూరత్వమేనా..? విద్యార్థుల ఆందోళన బాట దేనికి సంకేతం.. హాస్టళ్లలో విద్యార్థుల ఆహారంలో ఎలుక ప్రత్యక్షం ఏ మార్పు కెసిఆర్‌ ‌బాటలోనే రాజకీయ చేరికలు..మార్పు ఉత్తదేనా…? కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలు కోరుకున్న మార్పు దిశగా అడుగులు వేయాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 2014 నుంచి…

మితిమీరుతున్న‘రోగ’ కారక ఫ్యాషన్‌!

 ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ వెల్లడిరచిన చేదునిజం  విచ్చలవిడిగా అవసరం లేని మందుల విక్రయం మన ఆధునిక జీవన రీతిలో విప్లవాత్మకమైన పరివర్తన కలగాలన్నది జాతీయ అంతర్జాతీయ ఆరోగ్య విశ్లేషకులు చెపుతున్న మాట.  ‘ఐక్యరాజ్యసమితి’ అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ’  వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ డబ్ల్యూహెచ్‌ఓ వారు ఈ వాస్తవాన్ని ఇప్పుడు మరోసారి ఆవిష్కరించారు.…

ఆహార శుద్ధి పేరుతో ‘అంగడి తిండి’

అంగడి తిండిని అదే పనిగా తినడంవల్ల చిత్ర విచిత్ర వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నది ధ్రువ పడిన వాస్తవం. చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌ లు, చిప్పులు, సుగర్‌ కాండీలు, హోమ్‌ బర్గర్‌లు, పింజల్‌లు, సాస్‌లు, విష రసాయన పరిమళాల  ఆర్ట్ఫిసియల్‌ ఫ్లేవర్‌లు- శీతల పానీయాలు, వంటలు మెరిసిపోయేందుకు వాడుతున్న రంగులు వంటివి ‘అంగడి తిండి’-జంక్‌ఫుడ్‌  లో…

నిర్జీవమైపోతున్న వ్యవసాయ భూమి!

భూమండల పరిరక్షణపై  ఐక్యరాజ్యసమితి ఆందోళన ఐక్యరాజ్యసమితి అనుబంధ అధ్యయన మండలి వారు ప్రపంచ మానవులకు మాంసం తినడం క్రమంగా తగ్గించి వేయాలంటోంది. మాంసాహారం భుజించడం తగ్గించడం భూమండల పరిరక్షణకు దోహదం చేయగలదన్నది ఇటీవల వెల్లడిరచిన తమ నివేదికలో ఈ ‘పర్యావరణ పరివర్తన వ్యవహారాల అంతర్జాతీయ అధ్యయన మండలి’ ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌-…