Category Shoba

నేటి బాలలే..భావి దివ్వెలు

ఇల నడయాడే పిల్లలు దైవానికి ప్రతిరూపాలు విధాతకు ప్రతిబింబాలు విశ్వ ప్రేమలకు ప్రతీకలు నేటి చిన్నారి బాలలు భావి భారత పౌరులు జాతి భాగ్య విధాతలు సమసమాజ నిర్మాతలు నవయుగ రథసారథులు ఆ చూపులు కురిసే వెన్నెల ఆ పదాలు పారే హిమజల ఆ స్వరాలు వేకువ రాగాలు ఆ స్పర్శలు చల్లని సమీరాలు ఆ…

పాలిటిక్స్ ‌పొల్యూటర్‌

తన అవసరం కోసం వంగివంగి దండం పెడతాడు ఉప్పొంగిపోయి ఆదరించావో కట్టుబట్ట కూడ మటుమాయం తన స్వార్థం కోసం ఆలింగనానికి యత్నిస్తాడు ఎరక్కపోయి హత్తుకున్నావో వెన్నుపోటు గాయం ఖాయం తన ఎజెండా కోసం భ్రమల లోకంలో ఊరేగిస్తాడు ఉబ్బిపోయి జేజేలు కొట్టావో కట్టుబానిసత్వం ఇక శరణ్యం అధికార పీఠం కోసం కపట నాటకం ప్రదర్శిస్తాడు కరిగిపోయి…

అక్షర క్షేత్రంలో నరమేధం

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకి సంస్కృతి పెచ్చరిల్లి మరో నరమేదాన్ని సాగించింది ఉన్మాద భూతం జడలు విప్పి పాఠశాల మీద విషం చిమ్మింది మనోదౌర్బల్యం వెర్రితలలు వేసి పసి పిల్లలు ప్రాణాలు బలిగొంది ఓ సైకో కిల్లర్‌ ‌బడిలోకి చొరబడి కాల్పులకు తెగబడిన దుర్ఘటన టెక్శాస్‌ ‌రాష్ట్రాన్ని వణికించింది చెల్లాచెదురై పడిన మృతదేహాలు మృతుల తల్లిదండ్రుల రోధనలతో…

పరువు కంచే

నిండు చంద మామలో మచ్చను చూడగలం అబేధ్యమైన లక్ష్యాలను సునాయాసంగా సాధించగలం కొత్త ఆవిష్కరణలు చవి చూడగలం ఒకప్పుడు వంట్టింటికే పరిమితమైన మగువలు మగవారితో పోటీ పడగలరు అభివృద్ధిలో ఇతర దేశాలు తో పోటీ పడుతూ ముందంజ వేయగలం భాషలలో రారాజు తెలుగు భాష అని ఎందరో ఇతర భాషాభిమానులు గుర్తించ గలరు అంటు మొక్కలను…

మాట్లాడుకుందాం!

మనం మాట్లాడుకుందాం మనసుల్ని రంజింపజేసే వసుధైక సుగంధాల మధ్య మనం మాట్లాడుకుందాం యుగయుగాల సంకుచిత హద్దుల్ని చెరుపుకొని సౌహార్ద్ర రాగాల సంగతుల్ని నింపుకొని మనం మాట్లాడుకుందాం చెట్లతో గాలి మాట్లాడుకున్నట్టు కడలి గట్లతో అలలు మాట్లాడుకున్నట్టు రాత్రితో వెన్నెల మాట్లాడుకున్నట్టు పగటితో సూర్యరశ్మి మాట్లాడుకున్నట్టు బాధలన్నీ విడనాడి బాధ్యతలన్నీ గుర్తెరిగి మళ్లీ మళ్లీ మాట్లాడుకుందాం మన…

పది సప్త పది

ప లు విధముల పది మీకు ‘సప్తపది’ ద శ మారు మీ ‘దిశ’ మార్చు ఈ తరగతి వ రమిది మీ భావి బంగరు ‘భవితకు’ త డబడక సాగు ‘ప్రగతి’ బాటలోన ర గిలించు నీ మది ‘జ్ఞాన’ కొలిమిలోన గ తి తప్పకు ‘గమ్యానికి’ ఇది తొలి మెట్టు తి రుగకు…

ఇదా రాజకీయం?

సమాజపు ఉజ్వల భవితతో ఆటలాడుతోంది నేటి రాజకీయం. ఆహా! ఏమి పాలన పదాలే లేకపోయె పొగడడానికిజి ఓట్లు రాల్చుకోవడమే లక్ష్యంగా ఉచితాల సంతర్పణలతో రాజకీయం ఎంత ఎదిగింది. పదవంటే ‘‘పంచడమే’’ననే కొత్త నిర్వచనానిచ్చిన దూరదృష్టి కొరవడిన నాయకుల పదవి,అధికారం వెంపర్లాటలో నీతి, నియమం,సిగ్గూ,లజ్జా లేక మద్యాన్ని అమ్ముతూ,అప్పుల్ని చేస్తూ రాజ్యపు ప్రగతిని సమాధి చేస్తూ పబ్బం…

ప్రకృతి ముంగిట్లో…

ఇక తెలియదు ఆ ఎంతగానో వికసించిన నిమిత్తమాత్రునికి అది అపోహ మాత్రమే ఒకవైపు మాత్రమే కదా సృష్టిలో కొన్ని సూత్రాలు నడుస్తాయ్‌ అం‌టూ కొన్ని ఆకారాలు వెతుక్కున్నాడు అవెక్కడైనా ఒకేలాగా నడుస్తూ ఉంటాయ్‌ ఒక చెట్టు ఒక రెక్క ఒక నడక ఏదైనా… కాల్పనిక ప్రపంచంలో సంబంధబాంధవ్యాల్లో వ్యవహారాల్లో కూడా పనిచేసుంటే బావుణ్ణు కదా! జయాపజయాల్లో…

ద్వీప దేశం నేర్పే పాఠం

ఇపుడు ద్వీప దేశం శ్రీలంక రావణకాష్టమై రగులుతోంది పౌర సమాజం గడప దాటి ఆందోళనల బాట పట్టింది నింగినంటిన నిరసనలు చెలరేగుతున్న ఘర్షణలు హింసాత్మక ఘటనలతో శ్రీలంక అట్టుడుకుతుంది పాలించే నేతల దుర్నీతి ఓట్లను కొల్లగొట్టే ఆపతి పీఠంపై పట్టుబిగించే కుతి బంధు వర్గంపై ఆశ్రీత ప్రీతి అహేతుక ఆర్థిక విధానాలే శ్రీలంక సంక్షోభానికి కారణం…