Category Shoba

మాట్లాడుకుందాం!

మనం మాట్లాడుకుందాం మనసుల్ని రంజింపజేసే వసుధైక సుగంధాల మధ్య మనం మాట్లాడుకుందాం యుగయుగాల సంకుచిత హద్దుల్ని చెరుపుకొని సౌహార్ద్ర రాగాల సంగతుల్ని నింపుకొని మనం మాట్లాడుకుందాం చెట్లతో గాలి మాట్లాడుకున్నట్టు కడలి గట్లతో అలలు మాట్లాడుకున్నట్టు రాత్రితో వెన్నెల మాట్లాడుకున్నట్టు పగటితో సూర్యరశ్మి మాట్లాడుకున్నట్టు బాధలన్నీ విడనాడి బాధ్యతలన్నీ గుర్తెరిగి మళ్లీ మళ్లీ మాట్లాడుకుందాం మన…

పది సప్త పది

ప లు విధముల పది మీకు ‘సప్తపది’ ద శ మారు మీ ‘దిశ’ మార్చు ఈ తరగతి వ రమిది మీ భావి బంగరు ‘భవితకు’ త డబడక సాగు ‘ప్రగతి’ బాటలోన ర గిలించు నీ మది ‘జ్ఞాన’ కొలిమిలోన గ తి తప్పకు ‘గమ్యానికి’ ఇది తొలి మెట్టు తి రుగకు…

ఇదా రాజకీయం?

సమాజపు ఉజ్వల భవితతో ఆటలాడుతోంది నేటి రాజకీయం. ఆహా! ఏమి పాలన పదాలే లేకపోయె పొగడడానికిజి ఓట్లు రాల్చుకోవడమే లక్ష్యంగా ఉచితాల సంతర్పణలతో రాజకీయం ఎంత ఎదిగింది. పదవంటే ‘‘పంచడమే’’ననే కొత్త నిర్వచనానిచ్చిన దూరదృష్టి కొరవడిన నాయకుల పదవి,అధికారం వెంపర్లాటలో నీతి, నియమం,సిగ్గూ,లజ్జా లేక మద్యాన్ని అమ్ముతూ,అప్పుల్ని చేస్తూ రాజ్యపు ప్రగతిని సమాధి చేస్తూ పబ్బం…

ప్రకృతి ముంగిట్లో…

ఇక తెలియదు ఆ ఎంతగానో వికసించిన నిమిత్తమాత్రునికి అది అపోహ మాత్రమే ఒకవైపు మాత్రమే కదా సృష్టిలో కొన్ని సూత్రాలు నడుస్తాయ్‌ అం‌టూ కొన్ని ఆకారాలు వెతుక్కున్నాడు అవెక్కడైనా ఒకేలాగా నడుస్తూ ఉంటాయ్‌ ఒక చెట్టు ఒక రెక్క ఒక నడక ఏదైనా… కాల్పనిక ప్రపంచంలో సంబంధబాంధవ్యాల్లో వ్యవహారాల్లో కూడా పనిచేసుంటే బావుణ్ణు కదా! జయాపజయాల్లో…

ద్వీప దేశం నేర్పే పాఠం

ఇపుడు ద్వీప దేశం శ్రీలంక రావణకాష్టమై రగులుతోంది పౌర సమాజం గడప దాటి ఆందోళనల బాట పట్టింది నింగినంటిన నిరసనలు చెలరేగుతున్న ఘర్షణలు హింసాత్మక ఘటనలతో శ్రీలంక అట్టుడుకుతుంది పాలించే నేతల దుర్నీతి ఓట్లను కొల్లగొట్టే ఆపతి పీఠంపై పట్టుబిగించే కుతి బంధు వర్గంపై ఆశ్రీత ప్రీతి అహేతుక ఆర్థిక విధానాలే శ్రీలంక సంక్షోభానికి కారణం…

యోగాకు అమృతోత్సవ శోభ

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన శుభ తరుణంలో దేశవ్యాప్తంగా ‘‘ఆజాదీ కా అమృత మహోత్సవాలు’’ జరుపుకుంటున్నాం. ఈ చారిత్రక సంవత్సరంలో అమృతోత్సవాల స్ఫూర్తిని మరింత వ్యాప్తి చేసేలా ప్రపంచ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) ‌భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. యోగా డే కు వంద రోజుల ముందే దేశవ్యాప్తంగా యోగా సన్నాహక…

అపారవశ్యం

మంచు కురిసిన పరిసర పసిరికల్లో ముసుగు వేసుకున్న ఆమె తెల్లని చేతుల దోసిట్లో కొన్ని నిన్నటి ప్రేమ బిందువులు పెదవుల్లో ఉబికి రాని దాటని మాటలు ఆ వనంలో రెక్కలు విదిలీయని పక్షుల్లా విరబూయని పువ్వుల్లా చీలిన చిగురుల్లా నిశ్చలంగా మూలుగుతున్న వృక్షాల్లా ఒక నిశ్శబ్ద నిరసన గీతాన్ని పాడుటకు సిద్ధంగా ఉన్నాయి ఆమె అనుమతికై…

నువ్వూ…నేనూ…వెన్నెల

మనమిద్దరం తొలి సంధ్యలో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు తొలికిరణాల స్పర్శతో పులకించిపోయిన ఎన్నెన్ని పూల బాసలు! ఆకాశమే హద్దుగా కిలకిలలాడిన ఎన్నెన్ని పక్షుల ఊసులు! ఆనందమే ఆశయంగా చిగురులు తొడిగిన ఎన్నెన్ని వసంత రాగాలు! మన సంతోషాలతో జత కలిపిన ఎన్నెన్ని తొలకరి జల్లులు! మన ప్రయాణంలో మనమధ్య బద్దలైన అగ్నిపర్వతాల ఎన్నెన్ని విస్పోటనాలు! మన కోపాలతో…

అర్దాల ఏకమే!

రోజు అంటే… రేయింబవళ్ళ చలనమే! సంవత్సరము అంటే రెండు ఆయనాల ఆవృతమే! దారికి తెలియని గమ్యం రెండు పాదాల గమనమే! పగలు – రేయికి రాజులు ఆ సూర్య – చంద్రులే! కారు చీకటి మబ్బుల్లో మిలమిల మెరుపుల ఉరుములే! వినీలాకాశానికి అందం మిలమిల మెరిసే తారక లే! జీవులు పుట్టుట- గిట్టుట పెరిగి -విరుగుట…