Category Shoba

ఏ జండా కావాలి

నిప్పుల వాగు కత్తుల సాగు శాంతి వనంలో పారవు అహింసా పొలంలో పండవు తెలుపు అకుపచ్చ పతాకపు రెపరెపల కిందా తోటలోని పూలలా స్వేచ్ఛగా తిరుగాడె పక్షులా బతుకు తున్నారు జనం ఆకలి దప్పిక తీర్చే ధరిత్రిని రాజ్యాధికార ధిక్కారంతో బడా వ్యాపారులకు కొమ్ము కాస్తే పారుతుంది నిప్పుల వాగు పండుతాయి కత్తుల కంకులు రెపరెపలాడుతుంది…

మెరుపు తీగెలు అదృశ్యులు!

ఎప్పుడూ అద్దంలో ముఖం చూసుకోవడమే అలవాటు. కాని యీ మధ్య స్టీల్ ప్లేట్లో ముఖం చూసుకుంటున్నా. అదీ భోజనానికి కూర్చున్నప్పుడు. వడ్డించడానికి ముందు. ఈ విషయం మా ఆవిడ కనిపెట్టినట్టే వుంది.           “దువ్వెన తెచ్చి యివ్వనా?” అడిగింది.           నేను నవ్వలేదు. ‘ఉన్నవి నాలుగు వెంట్రుకలు గాని, వో యిదైపోతారు’ గొణుగుతూ వడ్డించబోతున్న మా…

నాలాంటివాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు

 “సాహిత్యం అంటే కేవలం అక్షరాలా కూర్పు కాదు, భావాలను ప్రభావితం చేసే, మనసును మార్చే, ఆలోచనలకు ప్రేరణనిచ్చే వాస్తవికకళ!” అని ఎవరి ఫేస్బుక్ గోడ మీదనో చదివినట్టు గుర్తు. అలాగే “దేశం కోసం మరణించే వాళ్ళు వీరులు, దేశాన్ని నిలబెట్టేది సాహిత్యం.” అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంత నిజం, సాహిత్యానికి ఎంత బలం వుందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్ముడు పోయిన మీడియా, రాజ్యం చేతిలో కీలుబొమ్మై ఆడుతున్నచోట నేడు సాహిత్యమే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వపు కపటత్వాల్ని, రహస్యాల గుట్టువిప్పి చెప్తుంది. ప్రజల్ని అదెలా దోపిడీ…

పుస్తకాల పండుగ వచ్చేసింది

“2025 డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 28 వరకూ తెలంగాణ కళాభారతి స్టేడియంలో 38 వ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ జరుగనున్నది. ఈ సందర్భంగా వస్తున్న కొత్త పుస్తకాలు, పునర్ముద్రణలు, వాటి ప్రాధాన్యతల గురించి కొన్ని ప్రచురణ సంస్థలనుంచి సేకరించిన సమాచారం- ఈ వారం ప్రజాతంత్ర ‘శోభ’ పాఠకుల కోసం.” ఈ పుస్తకాల పండగకి బీట్‌రూట్…

చిన్నిమొగ్గ వెలుగు

అద్దం ముందు నిలబడ్డ ప్రతిసారీ ఆమెకు తనకళ్లల్లో ఏదో తెలియని కలత, మనసులో ఏదో చెప్పలేని భారంలా అనిపించేది. ఆమె పేరు సాహితి. తన చిన్న ప్రపంచాన్ని ప్రేమతో, నమ్మకంతో నడిపించే ఓ మంచి మనసు ఆమెది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె కళ్లచుట్టూ చేరిన నల్లటి వలయాలు, ఆ అద్దంపై కనిపించే మరకలు, ఇవన్నీ…

గాలి కథ

మెరుపు తీగెలు   “దెయ్యం దెయ్యం… నువ్వున్నావా?”           “ఉన్నాను, లేకపోతే నువ్వెందుకు నన్నడుగుతావ్?”           “దెయ్యాలు లేవంటారు కొందరు…”           “లేనోళ్లకి లేవ్…”           “దెయ్యాలు వున్నాయంటారు కొందరు…”           “ఉన్నోళ్లకి వున్నాయ్…”           “అసలు నువ్వు వున్నావో లేవో సరిగ్గా చెప్పు”           “నాక్కూడా తెలీదు…”           “దేవుడు వున్నట్టయితే దెయ్యమూ వున్నట్టే…

కోరిక మాట తప్పదు

ఎప్పటికీ మాట తప్పదు నా కోరిక ఎంత దూరంలో ఉన్నా పాతకాలం నాటి ఏ ఇష్టాన్ని గాయపరచుకోదు ఎద తలుపు తట్టి పిలవాలే గాని బదులు పలికేందుకు ఏ లోతుకు అలసటుండదు ఎదుటపడి ఏరుకునే ఆలోచన ఉండాలేగానీ ఏ అర్ధం అడ్డుగోడకాలేదు ఒక్కో క్షణం ఒక్కో కోరికలా గతాన్ని చదివించి భవిష్యత్తుని బోధిస్తుంది -చందలూరి నారాయణరావు

అల్లిక జిగిబిగి

చేపల వేట నక్కలు గద్దెలపై జ్ఞానంపై దాడి శ్రమ దోపిడి కర్మకష్టాల ఊబి కార్మికసమ్మె ఆమె పాఠాలు విప్లవ సిద్ధాంతాలు అమ్మ నవల జీవన వైనం పండుగ ఆనందాలు దక్షిణాయనం మూడాసులాట రొక్కం ముక్తికి చోటు ఊచల బాట -రేడియమ్

వాళ్ళ గుండెల్లో మంట ఉంది

కాళ్ళూ రెక్కలూ లేని తరం మొలిచిందని కలతపడ్డా కన్నీటి పొరలు ఒక్కొక్కటీ ఆవిరవుతున్నాయి అలా గాలిలో తేలుతున్న ఒక చిన్న నినాదం వేసవి రోడ్ల పొగమంచులో నిన్నటి జ్ఞాపకంలా వినిపించింది ఆ నినాదం ఎవరిదీ ఎవరి కోసం ఎందుకోసం దేనికోసం ఆ చిన్న నినాదం విన్నప్పుడు తెలియలేదు కానీ ఏదో ఒకమార్పు చిన్నగా గుండెల్లో కొట్టుకుంది. ఇన్నాళ్లకి నేను మళ్ళీ…