Category Shoba

అంత‌రాగ్ని…

antharaagni

క‌విత్వ త‌త్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే క‌వి క‌విత్వాన్ని అందించ‌డానికి ముందు ప‌డిన అంత‌ర్మ‌థ‌నాన్ని గురించి ఆలోచించి తీరాలి. కొన్ని నిరాశ‌లు, కాసిన్ని క‌న్నీళ్లు, ఇంకొన్ని అనుభూతులు, మ‌రికొన్ని అమృత భావాలు క‌ల‌గ‌లిసి క‌విత్వం  ప‌రివ్యాప్త‌మై మేధోసీమ‌కు చేరువవుతుంది. ఎన్నో అనుభూతుల సృజ‌న స‌మ్మేళ‌న‌మైన క‌విత్వంలోని ధ్వ‌నిని అర్థం చేసుకుంటే క‌విలోని అంతః చైత‌న్యం అర్థ‌మౌతుంది.…

ఆత్మ‌గౌర‌వ క‌థ‌…

అత్యంత ప‌రిణ‌తి, ఎంతో ఆత్మ‌విశ్వాసం ఏర్ప‌డిన త‌రువాత అక్ష‌రీక‌రించాల్సిన బృహ‌త్త‌ర బాధ్య‌త‌నే ఆత్మ‌క‌థ‌. స్ప‌ష్ట‌మైన  అవ‌గాహ‌న‌, గురుత‌ర బాధ్య‌త‌తో స‌మాజానికి త‌న జీవితం నుంచి అందించ‌వ‌ల‌సిన విష‌యాల‌తో రాసే ఆత్మ‌క‌థ భ‌విష్య‌త్తు త‌రాల వారికి త‌ప్ప‌నిస‌రిగా స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వాలి. ఆత్మ‌క‌థ‌లో అస‌మగ్ర‌త‌కు చోటుండ‌దు. జీవితంలోని ప్ర‌తి అంశాన్ని నిజాయితీగా వ్య‌క్తీక‌రించే ధైర్యం ఉండి తీరాలి. ఆత్మ‌క‌థ…

నాకు యుద్ధం కావాలి

నాకు యుద్ధం కావాలి అణు ఇంధనం అణువంత నేల పైన మిగల కూడదు అందుకే నాకు యుద్ధం కావాలి పోయిన వాళ్లు మంచోళ్లు ఉన్న వాళ్లు మంచోళ్లు అంటే నేను అసలే ఒప్పు కోను భూ భారం యుగాల తరబడి పెరిగి పోతుంది త్రాసు ముల్లు నిశ్చల స్థితి లో ఉండాలి అందు కే నాకు…

అలాగే ఉంటుంది

పిట్టలు మాత్రమే ఎగిరిపోతాయి చెట్టు అలాగే దర్జాగా నిలబడుంటుంది పరిమళం మాత్రమే ఆగిపోతుంది గాలి అలాగే మంద్రంగా వీస్తుంటుంది పైరు మాత్రమే కోయబడుతుంది నేల అలాగే బలంగా ఉండిపోతుంది పడవలు మాత్రమే తీరం చేరుకుంటాయి సముద్రం అలాగే గంభీరంగా ఘోషిస్తుంటుంది సూర్యుడు మాత్రమే అస్తమిస్తాడు ఆకాశం అలాగే ఠీవిగా నిలిచుంటుంది రోజులు మాత్రమే గడిచిపోతాయి జ్ఞాపకం…

ఈ మనిషి ఆ మనిషికి లేనట్టేనా?

ఈ క్షణం ఆఖరిది. ఇక  ముఖాన్ని కనిపించకుండా మూటకట్టి మట్టికి కబురు పంపే తుది ఘట్టం. కొద్ది గంటల్లో భౌతిక రూపం కూడా పంచభూతల్లో కలసి గొప్ప జ్ఞాపకంగా మాత్రమే మిగిలే సమయం. ఇప్పుడు హాజరు కాకపోతే ఈ మనిషి ఆ మనిషికి లేనట్టే.. తరువాత పుట్టే ఓదార్పులాంటి పలకరింపులు ఆ ఆత్మకు చేరవు. సుదీర్ఘమైన…

పచ్చని రక్త కన్నీరు

telugu latest news, telugu articles

మళ్లీ ఎప్పుడు పుడతావు నేస్తం హక్కుల సాయిబాబా ఒకసారి వస్తే అక్కున చేర్చుకుంటామంటూ! ఆదివాసి గూడాలు నీకోసం ముంగిట్లో నిలబడి ఎదురుచూస్తు ఉన్నాయి! నీవు లేనందుకు అడవి ఎన్ కౌంటర్ కట్టు కథల మధ్యన రోదిస్తుంది! దండకారణ్యం ను రాజ్యం రాక్షసంగా కౌగిలించుకుంటున్నది! తూటాల దెబ్బలకు పచ్చని చెట్లు రక్త కన్నీరు కారుస్తూన్నాయి! నీ త్యాగం…

బాబా మా సాయిబాబా

ఎవరేమై పోతే మనకెందుకు? మనకోసం బ్రతుకునంతా బలిచేసినందుకు అధికారం అసహనంతో పాశవికంగా జైలుగోడల నడుమ ఊపిరాడకుండా చేసినా ప్రజల గొంతుకై ప్రాణంగా నిలిచి ప్రశ్నిస్తూ పడుతూ లేస్తూ కదలలేని కాళ్ళతో చక్రాల బండికి పరిమితమైనా తన మాటలతో లక్షలాది మెదళ్ళను జాగృతం చేసిన వాడు అన్యాయంగా దుర్మార్గంగా పదేళ్లు అండా సెల్ నరకాన్ని చిరునవ్వులతో భరిస్తూ…

ఉప్పు నీరు

నీరు నీరేలే ఉప్పు నీరేలే కళ్లల్లో ఉప్పు నీరేలే చెమటల్లోను కష్టాల కడలి లోను ఉప్పు ఉప్పు నీరేలే… తిండి లోను ఉప్పు శరీరం లోను ఉప్పే ఉప్పు మోతాదు మించిన ఉప్పు మోతాదు తగ్గిన నాడి వ్యవస్థ నాశనం మందులతో ఇక సహజీవనం… ఉప్పు లేకుండా ముద్ద దిగదు ఉప్పు పై తెల్లవాళ్లు పన్ను…

అనిశ్చితి!

కాలం  కదులుతూనే ఉన్నా.. సమయం ఎందుకనో చాలటం లేదు!? కాళ్లు రెండూ పరిగెడుతూనే ఉన్నా.. గమ్యం ఎందుకనో చేరడం లేదు!? వాతావరణం సరిగానే ఉన్నా.. ఊపిరి ఎందుకనో ఆడటం లేదు!? పుస్తకాలు చదువుతూనే ఉన్నా.. జ్ఞాపకం ఎందుకనో ఉండడం లేదు!? ప్రాణం నాతోనే ఉన్నా.. ఎందుకనో జీవం లేని ప్రాణి ల ఉంది పరిస్థితి!?  –…