సాహిత్య సమాచారం

ఇంతియానం 2.0 ఆవిష్కరణ మహిళల యాత్రానుభవాల సంకలనం ‘ఇంతియానం 2.0’ పుస్తకావిష్కరణ సభ, ఏప్రిల్ 20, సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్ లో జరుగుతుంది. తెలుగులో మహిళా యాత్రికుల అనుభవాలతో వచ్చిన తొలి సంకలనం ‘ఇంతియానం’కు ఇది రెండవ భాగం. రెండు భాగాలతో కలిపి మొత్తం 100 మంది మహిళా యాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సభకి గౌరవ అతిథులుగా డాక్టర్ సి. మృణాళిని, అమరేంద్ర దాసరి వస్తున్నారు. అపర్ణ తోట, స్వర్ణ కిలారి సభా నిర్వహణ చేస్తారు. సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం. కథలకి ఆహ్వానం…








