Category సన్నివేశం

కంటతడి మరచిపోయామా?పొడిబారిపోయామా?

Have we forgotten our tears? Have we become dry?

గురువారం మిట్ట మధ్యాహ్నం, కడుపు నిండుగా మనుషుల్నీ, వాళ్ల జీవితాలనీ కలల్నీ కర్తవ్యాలనీ మోసుకుని ఎగరబోయిన లోహవిహంగం, కుప్పకూలిపోయింది. మండిపోయింది. దగ్ధ మాంసశకలాలుగా పిగిలిపోయింది. పైకి ఎగతన్నుకోలేకపోతున్నాను, శక్తి చాలడంలేదు, నేలరాలిపోతున్నాను అన్న సందేశాన్ని వదిలి నిస్సహాయంగా విస్ఫోటించింది. చావుల మీద యుద్ధానికి చదువులు పదునుపెడుతున్న, అన్నం కంచాల ముందు కూర్చున్న, రేపటి డాక్టర్ల మీద…

శకలాలుగా ఉన్నాము, తిరిగి సకలజనులం కాగలమా?

మొన్న మే 31 న హైదరాబాద్‌ లో జరిగిన ఒక విశేషం గురించి చెప్పుకోవాలి. తెలంగాణ జర్నలిస్ట్స్‌ ఫోరమ్‌ (టిజెఎఫ్‌) ఇరవై నాలుగో ఆవిర్భావ దినోత్సవం- రజతోత్సవాల ప్రారంభం వేలాది మంది పాత్రికేయుల మధ్య ఉద్యమజ్ఞాపకాల ఉద్వేగంతో, ఒక పునస్సమాగమ ఉత్సాహంతో జరిగింది. అంతటి సందోహాన్ని చూసి నిర్వాహకులు, ప్రేక్షకశ్రోతలు అందరూ ఆశ్చర్యపోయారు. చాలా కాలం అయింది కదా, తెలంగాణ ఉద్యమాన్ని తలపోసుకుని! విద్యార్థి ఉద్యమ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, న్యాయవాద సంఘ నాయకులతో…

సారు మారతారా, కారు రిపేరవుతుందా?

ఎంతో ముఖ్యమైనవి, సామాజిక ప్రాధాన్యం ఉన్నవి చాలా పరిణామాలు కళ్లెదుట  ఉన్నాయి. ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, నిరసనల మీద గృహనిర్బంధాల నీళ్లు చల్లుతూ  నిర్వహిస్తున్న  ప్రపంచసుందరి పోటీలు, అభాసుపాలయ్యాయి, అందులో సౌందర్యాత్మక హింస తప్ప, సంస్కారమేమీ లేదని పోటీదారులే చాటి చెబుతున్నారు. ఈ పోటీల వ్యవహారం నిర్వాహకులకే కాదు, తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి,  తెలంగాణ ప్రతిష్ఠకు కూడా మచ్చ తీసుకువచ్చింది.…

…ధూమధామమ్ము, దుఃఖ సంగ్రామ భూమి!

దేశం నిర్లిప్తంగా ఉన్నదా, నిస్సహాయంగా ఉన్నదా, కేవలం నిశ్శబ్దంగా మాత్రమే ఉన్నదా? అందులో అంగీకారం కూడా ఉన్నదా? విడత విడతకూ ఇరవైలు ముప్పైలు చొప్పున కాల్చివేతలు జరుగుతూ, మృతుల సంఖ్య వందలలోకి పెరిగిపోతూ,  మధ్యభారతంలో ఒక ఏకపక్ష యుద్ధం కనిపిస్తుండగా, ఎందుకు ఏ అలజడీ లేదు? అలికిడీ కూడా అంతంత మాత్రమే ఎందుకు? ఇవే అంకెలు వేరే సందర్భాలలో కనిపిస్తే గగ్గోలు పెట్టే,  రాజకీయులందరూ ఎందుకు…

ఆశలు తుంచుకోవడమే, విధేయత!

భారత్‌ రాష్ట్ర సమితి అగ్రశ్రేణి నాయకులలో ఒకరైన తన్నీరు హరీష్‌ రావు పార్టీ అధినేతకు, పార్టీకి తన విధేయత గురించి మళ్లీ బహిరంగంగా వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. కెసిఆర్‌ గీసిన గీత దాటని క్రమశిక్షణ తనదని చెప్పడమే కాదు, ఒకవేళ, కెటిఆర్‌ కు నాయకత్వం అప్పగిస్తే అందుకు తాను పూర్తిగా అనుగుణంగా ఉంటానని కూడా స్పష్టం…

మరి రెండో రణరంగాన్ని ఎవరు మూసేస్తారు?

శనివారం సాయంత్రం దాకా చాలా తీవ్రమైన, విషాదకరమైన, విచిత్రమైన, ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మొత్తంగా పరిస్థితి మారిందని కాదు కానీ, ఒక ఊరట. దాదాపు ఇరవై రోజుల నుంచి ఒకదానికొకటి ప్రతిక్రియగా జరిగిన అనేక గొలుసుకట్టు పరిణామాలు ప్రజలు కోరుకున్నవి కాదు. తమ మీద విరుచుకుపడుతున్న సత్యాసత్యాల ఉప్పెనల మధ్య, ఉక్కిరిబిక్కిరి కావడమే తప్ప,…

ప్రసంగం బాగుంది కానీ, పశ్చాత్తాపం లేదు!

అంత పెద్ద సభ, కెసిఆర్‌ గంభీర ప్రసంగం తరువాత, భారత్‌ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉనికికి, భవిష్యత్తుకి తిరుగులేని  భరోసా దొరికినట్టు సంబరపడుతున్నారు. శ్రేణుల నుంచి బలప్రదర్శన, నాయకుడి నుంచి దిశానిర్దేశం దొరికాక, ఇక విజయానికి పరుగులు తీయడమే మిగిలిందని పార్టీ అభిమానులు, అనుకూల పరిశీలకులు నమ్మకం ప్రకటిస్తున్నారు. తటస్థులు, వ్యతిరేకులు…

భయబీభత్సాల నడుమ ‘భారతీయ ఆత్మ’

విలాపాగ్నుల విషాదాశ్రువుల నడుమ జీవిస్తున్నాం. నిర్దాక్షిణ్యమైన శక్తుల వీరవిహారంలో నిస్సహాయంగా నిలబడి ఉన్నాం. కావలసిన చోట రక్షణ దొరకదు. అవసరమైన చోట విచక్షణా దొరకదు.ఒక్కోసారి, హింస కంటె దాని చుట్టూ కాంతిపుంజం లాగా మెరిసిపోయే ఆవేశాలు, ఉద్వేగాలు ఎక్కువ భయానకంగా ఉంటాయి. ఒకచోట జరిగిన విస్ఫోటక సంఘటన, దాని అనేక పర్యవసానాలతో, నానార్థాలతో, విషకాలుష్యంతో లోకాన్నంతా…

గోముఖ వ్యాఖ్యలను జనం పసిగట్టలేరా?

కళ్లెదుట ఉన్నదాని నుంచే, మన ముందూ వెనుకా చుట్టూ ఉన్న ప్రపంచం నుంచే అన్నీ పుడతాయి,  విచారమైనా వినోదమైనా, ఆగ్రహమైనా ఆక్రోశమైనా, హహాకారమైనా హాస్యరసమైనా! చుట్టూ ఇన్ని నెత్తుటివరదలున్నాయి కదా, ఇంతటి క్రూరత్వమూ ద్వేషమూ పరచుకున్నాయి కాదా, ఎట్లా చిర్నవ్వగలము, ఎట్లా చక్కిలిగిలి పొందగలము అనుకుంటే, జీవితమే ఉండదు. కాబట్టి, నవరసభరితమైన నాటకాన్ని పంటిబి గువున,…