Category సాహిత్యం-శోభ

ఊట

ఆమో అతనో ఎవరో ఎనలేని మార్పు కోరుతున్నారు అది ఇక ముందులా ఉండొద్దు కొన్ని టైప్స్ ‌లోనో పోలికల్లోనో పొసగొద్దు ఒక నయా అనుభూతినివ్వాలె చూడంగానో వినంగానో అరె ఇది మాకు తట్టలేదే అన్న ప్రశ్న లోలోపలికెళ్ళాలె నేరుగా ఇదో ఆర్కిటైప్‌ అసలే అవ్వొద్దు దీనిలా కొన్ని కాపీలూ మోడల్స్ ‌రానూవొద్దు ఎన్నాళ్ళుండాలో అలా అవన్నీ…

కొత్త చరిత్ర

పొరలు తీసే కొద్దీ మట్టి తవ్వే కొద్ది నగరాలో… నాగరికతలో బయట పడుతునే ఉంటాయి గెలుపు కాంక్ష శిథిల సమాధుల్లో అల్లుకున్న తీగై దర్శన మిస్తుంది ఓ అవ్యక్త వాంఛ దేహం నుంచి దేహంలోకి కాలం నుంచి కాలంలోకి ఓ ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి అనంత చలన శక్తై ప్రసరిస్తూనే ఉంటుంది నిగూఢ శక్తి…

విన్నపాలు వినవలె

ప్రియ పయోధరమా! ఈ సారి నీవు త్వరగా కరుణిస్తావంటే రైతన్న వదనాన చిరు నవ్వు మెరిసింది, వసుధమ్మ త్వరలోనే తన కడుపు పండుతుందని సంతసించింది. ఆకులు రాల్చిన చెట్టు మళ్ళీ చిగురిద్దామని, సంతోషంగా తలలూపుతూ జల్లుల్లో సరిగంగ తానాలాడాలని వృక్షాలు, ఒళ్ళింత తుళ్ళింత అయితే తమ బెక బెకలతో సందడి చేయాలని మండూకలు, ప్రకృతంతా పచ్చగా…

దానవత్వాన్ని దహిద్ధాం !

మనిషితనాన్ని రాయి చేసుకున్నడు రాయిని దేవునిగా పూజిస్తున్నడు రాక్షసత్వాన్ని లోన నింపుకున్నడు నెపం రాతిపై నెడుతున్నడు! అంతరంగంలో శూన్యం ఏర్పడితే దానవత్వం దండయాత్ర చేస్తుంది ఎలా బతకాలో తెలిసేలోపు ఈర్ష్యాసూయ ద్వేషాలు గాండ్రిస్తున్నవి మానవత్వం ఆపద బోనులో దోషిగా నిలుచుంటుంది! మనిషిలోని దానవ త్వాన్ని దహిద్దాం మానవత్వాన్ని మనిషిలో మేల్కొల్పుదాం మానవత్వాన్ని వారసత్వంగా పంచుదాం మనిషి…

కాటికి చేరిన ప్రాయం!

వయసు ఉన్నప్పుడు ప్రణయం రాదు! ప్రణయం వచ్చే వరకు పరువం ఆగదు! హేమంతంతో సంగమం శిశిరంలో సాగితే! వసంతంతో సమాగమం ఉక్కపోతలో జోగితే! సోయలన్నీ జారిపోతూ సొబగులన్నీ జోలిపోతూ! వలపులకు, తలపులకు వియోగాలే మిగిలినవేళ! చెరుపులకు, మరుపులకు సంయోగాలే కలిగినవేళ! సింగారాలకు సిగపట్లు చాలక వయ్యారాలకు అగచాట్లు లేక! ఊహలు పుట్టని ఊసుల్లో కలలు రాని…

 ‌డోజర్ల దౌడులు

రాగద్వేషాల నాటకాలు.. భయ పక్షపాతాలకే.. పట్టం కట్టే కీచక పర్వాలు విభజించి పాలిస్తూ.. లక్షిత సమూహాలపై.. బుల్డోజర్లు దౌడుతీతలు ఉత్తర భారతాన కూల్చు వేతలు ! బుల్డోజర్‌ ఒక యంత్రమే కాదు.. భవనాల తలల్ని నరికే ఆయుధం విద్వేష విచ్ఛిన్న విధ్వంస చిహ్నం సామాన్యడి ఇంటిపై ఉక్కుపాదం నాగరికతను చూర్ణం చేసే డోజర్‌ ‌రాజ్యాంగ విలువలకు…

మెరుపు గింజలు

అక్కడ కొన్ని దేహాలు మాట్లాడతాయి కొమ్మలకు ఇప్పటికీ వేళాడబడి వుంటాయి అల్లంత దూరంలో గొంతులను పేర్చబడి చోద్యం చుస్తూ వున్న కొన్ని రాబందులు కుప్పల తెప్పల సంజాయిషీలు పడి వుంటాయి సైగలు చేసే చేతులు కాలే కడుపులు ఎండిన డొక్కలు దీనంగా చూస్తుంటాయి ఆ చూపుల తడిలో ఇప్పటికీ వెచ్చగా కొన్ని గింజలు మొలకెత్తుతుంటాయి చేసిన…

‘‘ ‌నిస్సహాయ జీవుల జీవిత ప్రస్థానం’’

చీకటి మింగేసిన జీవితాల్లో వెలుతురుకై పోరాటం… మబ్బుల కమ్మిన ఆకాశంలో ఇంధ్రధనస్సుకై ఆరాటం…. అసాధ్యమని తెలిసినా ఆశతో నెట్టుకొస్తున్న సగటు నిస్సహాయ జీవి జీవిత ప్రస్థానం… అచ్చెరువు గొలిపినా… ఎవరికీ పట్టని అంతులేని వింత ప్రయాణం. ఆటుపోట్ల మధ్య  జరిగే సంఘర్షణ. అలజడుల మధ్య ఏర్పడే  ఉప్పెన. అసహాయులకది పెను పోరాటం. నిత్యం జరిగే జీవన…

అసంపూర్ణ శిల్పాలు

అదిగో ఎన్ని ఉదయాలు తుడుచుకుపోతున్నాయి కదా అయ్యో ముడుచుకుపోయిన నీ మెదడు తీరిగ్గా లేదు నిజానికి జారిపోతున్న నిన్ను పట్టుకోవడానికి సన్నద్ధంగా లేదు ఒక ఆలస్యం సొమరితనం అసంతులనం తికమక అసాహసపు అసహనం వెరసి ఒక జడత్వం కదలనివ్వవు కదిలినా సాగనివ్వవు సాగినా సాఫీగా అవనివ్వవు ప్రశ్నలకు దాటు సమాధానాలు వెతుక్కునే సమాధానాలకేమో మెలిక ప్రశ్నలు…