నవ మనువాదం
కమనీయమైన కల్లోలాలే రేగుతున్నయ్ నేడెక్కడైన పైకెంత గంభీరాన్ని మద్రించుకున్నా లోలోపలి అరాచకత్వం బయటపడుతునేవుంటుంది పైరగాలిలా మనసునెంత ఉల్లాసపరిచినా సుడిగాలిలా విసిరికొట్టెందుకేననే వికృతత్వం విశృంఖలత్వం ఒకటిగా పుడమిపై పురుడుపోసుంటుంటాయ్ ఏంతెలియనోళ్ళ ఉసురు తీస్తుంటాయ్ పున్నమిచంద్రులై వెలుగు విరజిమ్ముతూనేవుంటూ అంతలోనే ఆమావాస్యచీకట్లోకి జారుకొంటారు మాటలతో కోటలిక్కడ మహాద్భుతంగా నిర్మిస్తరు నీటిమీద రాసినవవి మరి క్షణంలో నట్టేట ముంచుడే నైజం…
