Category సాహిత్యం-శోభ

అల్లూరికి లాల్‌ ‌సలాం

‘ఆ చూపు మహోజ్వలితం ఆ రూపు దివ్య ప్రకాశితం ఆ గళం సింహా గర్జనం ఆ పిడికిలి విప్లవ సంకేతం ఆ ఆవేశం ఉత్తుంగ తరంగం ఆ అడుగు అభ్యుదయ పథం ఆ సాహసం అద్వితీయం ఆ సంకల్పం అజరామరం అతడే అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు దేశమాత స్వేచ్ఛ కోసం సాయుధ పోరు నడిపినవాడు…

కమ్మని ఆశ

ఎంత బాగుండేవి ఆ రోజులు? పాలమీగడ లాంటి మనసున్న మనుషుల మృదు మధుర భాషణలు విరిజల్లులా నిండుగా రాలుతూ మదిని తాకుతోంటే, మానసవీణ పురివిప్పిన మయూరమై పరవశించేది. మరి నేడో… ఎక్కడున్నాయి మనసును పులకరింపచేసే ఆ ఆత్మీయ పలకరింపులు? మనిషితనం కోల్పోయి, మంచితనం ఆవిరై, కృత్రిమత్వమే అంతటా.. ఎటుచూసినా,ఎక్కడచూసినా కమిలిపోతున్న మృదుత్వమే. ఆశలన్నీ కలువపూలై కనుదోయిలో…

కన్నీటి బొట్టు

గుండె అంతా ఆవిరి అయిపోయిన తరువాత మిగిలిందేమో బయటలోకానికి తను కనబడటానికి ఎంత తటపటాయించిందో! బండరాయిగా మారిన గుండెల్లో అట్టడుగున తన ఉనికే లేనట్లు దాక్కుంది! భావం లేని ఎడారి మనసులో ఎక్కడో కాస్తంత చెమ్మగా మిగిలిపోయింది! పరువుపోతుందని దిగాలుపడింది కానీ తన బరువుకు ఆ గుండే ఆగిపోతుందని గ్రహించలేదనుకుంటా! హాలహలం పోసి మనసు గర్భాన్ని…

అమృత మూర్తులు

పల్లవి: ఆడపిల్లలు అడవి మల్లెలు పుడమితల్లి శిగలో సిరిమల్లెలు ఆడపిల్లలు అడవి మల్లెలు పుడమితల్లి శిగలో సిరిమల్లెలు చరణం:1 అవనికి అందాలే ఆడపిల్లలు అఖిల జగతి అంతా సుమ గంధాలు పుట్టినిల్లు మెట్టినిల్లు మీ కోవెలలు మీ పాదమిడిన చోట దివ్య ధామాలు చరణం:2 ఆత్మీయ  ఆనవాళ్లు ఆడపిల్లలు అవిశ్రాంత శ్రామికులు ఆడపిల్లలు సృష్టికి ఆధారం…

ఒక్క క్షణం

ఎన్నో ఆశల సౌధాలు మరెన్నో నోముల ఫలాలు రెప్పపాటుకాలంలో విలువైన జీవితాన్నిడిచి రాలిపోతున్నాయ్‌ ‌గుండెల్లో తీరనివేధనను మిగిల్చి కనిపించని తీరం చేరువౌవుతుంటే చల్లారని కడుపుమంట నిత్యం రగులుతోంది ఏంటి చదువులు ఎటేపు దాని పయనం మనిషికి మనుగడ లేకుండా చేయ్యడమా ఒత్తిడిని మనసంతా నింపుకుని జ్ఞానమెక్కడ జారిపోతోందోనని నిండైన జీవితాన్ని ఒలకబోసుకుంటున్న భవిష్యత్తు సూర్యులు మానసిక…

పల్లె ముంగిట్లో…

రేపటి అత్యాశల గాలానికి చిక్కుకొని బలవంతంగా రూపురేఖలు మార్చుకుంటూ విలవిల్లాడుతోంది మావూరు… వేరునుంచి విడిపోయిన మొక్కలా దాహానికి దూరమైపోయిన నీటిచుక్కలా బావురుమంటోంది చెలిమిచెలమల్ని కోల్పోయిన నా హృదయపుటేరు… కాంక్రీటు గోడల నీడల్లో మావూరు వాడలన్నీ తమ జాడల్ని పోగొట్టుకుంటున్నాయి… నాకు పురాజ్ఞాపకాలుగా మీగిలిపోతున్న నా పల్లె అందాలనూ, అనుబంధాలనూ ఆత్మభూతద్దంలోంచి అదేపనిగా వెతుక్కుంటున్నాను… అప్పుడు మా…

హక్కులపై ఉక్కు పాదం

తను ఉగ్రవాది కాదు మతోన్మాది కానే కాదు సంఘవిద్రోహి అసలే కాదు అయినా రాజ్యం కుతంత్రానికి మరో క్రీస్తులా సిలువ మోస్తుంది ధ్వంస రచన చేయలేదు విధ్వేషాలు రెచ్చగొట్టలేదు వికృతాలకు  తెగబడలేదు అయినా పాలకుల దాస్టికానికి చీకటి జైల్లో బందీగా మిగిలింది సామాజిక ఉద్యమకారిణి తీస్తా సీతల్వాడ్‌ ‌నిక్కచ్చిగా బడుగు ,బలహీనుల పక్షాన గళం వినిపించడం…

పలు భావాల సమాహారం ఫోటోగ్రఫీ

జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా నాగరికంగా మనిషి ఎదగటం మొదలైన దశలో మానవుడికి తాను చూస్తున్న వాటిని వారసత్వ సంపదగా అందించాలనే కోరిక ఉండేది. కోరిక నుండి ఉద్భవించిన మహాద్భుతమే ఫోటోగ్రఫీ. ఎక్కడో రాతి గుహల గోడల మీద సూర్యకాంతి పడిన చోట నల్లగా మారటం గమనించి, కొన్ని రసాయ నాలు వెలుతురు పడిన మేర…

కూర‘గాయాలు’

కూరగాయల ధరలు చుక్కల్లో చేరి.. జన గుండెల్లో దడదడలు పుట్టించె.. పొట్లకాయ రేట్లు పాములా బుస కొట్టే.. కాకరకాయ రేట్లు చేదును రుచి చూపే.. సోరకాయ ధరలు పందిరెక్కి నవ్వె.. బీరకాయల వెలలు చాకులా కోతవేసె.. టమాటాను చూడ కండ్లు ఎర్రబడె.. ఆకుకూరల ధరలు అటకెక్కి కూర్చునె.. బెండకాయను తాక జిగురు చేతికందె.. దొండకాయలు నేల…